పంటల బీమాకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు

ABN , First Publish Date - 2021-07-27T06:06:45+05:30 IST

పంటల బీమాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమి యం కింద 30 శాతం చెల్లిస్తే మిగితా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చె ల్లిస్తుందని, కానీ ఆ మోత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లించలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతులకు వివరించారు.

పంటల బీమాకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించలేదు
పంటలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, జూలై, 26 : పంటల బీమాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమి యం కింద 30 శాతం చెల్లిస్తే మిగితా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చె ల్లిస్తుందని, కానీ ఆ మోత్తాన్ని కూడా ప్రభుత్వం చెల్లించలేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతులకు వివరించారు. రెండు రోజుల క్రితం కురిసన భారీ వర్షాలకు మండలంలోని రేచపల్లి గ్రామంలో వరదలకు నాటు వేసిన, నాటు వేయని పంట పొలాల్లో ఇసుక మేటలు పెట్టి రైతులు తీవ్రంగా నష్ట పోయిన పొలాలను పరిశీలించారు. ఈసంధర్బంగా విలేకరుతలో మా ట్లాడుతూ ప్రభుత్వం తమ వాటాను చెల్లిం చక పోవడంతో కేం ద్రం సాయం చేయలేని స్థితిలో ఉందని దీంతో రైతులు కోట్ల రూపా యలు నష్టపోతున్నారని తెలిపారు. మొత్తం ప్రీమియం రైతే చెల్లించు కుంటే రైతులకు పంటల బీమా అందుతుందని విషయాన్ని రైతులకు వివరంచారు. దేశంలో కేవలం పంటల బీమా ప్రీమియం చెలించని రా ష్ట్రం కేవలం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. పొల్లాల్లో ఇసుక దిబ్బ లుతొ లగించడానికి ఎకరాకు కనీసం రూ, 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వరదలతో మత్స్య కార్మికులు చెరువుల్లో వేసిన చేప పిల్లలు ఎ దిగే సమయంలో వరదల్లో కొట్లుకు పోయి తీవ్రంగా నష్టపోయారని వా రిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ సంవత్సరం వచ్చే సంవత్సర గ్రామ పంచాయితీల పరిధిలోని నీటిపారుదల శాఖపరిధిలోని చెల్లించాల్సిన టెండరు రుసుమును రద్దు చేసి మళ్లీ చేప పిల్లలను అందించి ఆదు కోవాలన్నారు. సమావేశంలో కోండ్ర రాంచందర్‌రెడ్డి, ఎండీ ఇబ్రాహీం, ఆకుల రాజిరెడ్డి, మోత్కూరి ప్రసాద్‌, తిరుపతి రెడ్డి, బేర మహేష్‌, కర్నె నర్సింహారెడ్డి, రాజిరెడ్డి, రాజేశం, రైతులు ఉన్నారు.

Updated Date - 2021-07-27T06:06:45+05:30 IST