పంచాయతీలకు పైసా ఇవ్వని ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-21T06:34:19+05:30 IST

దే శంలో పంచాయతీలకు పైసా ఇవ్వని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని గిరిజన మోర్చా జాతీ య కార్యవర్గ సభ్యు డు నేనావత బిక్కునాథ్‌నాయక్‌ ఆరోపించారు.

పంచాయతీలకు పైసా ఇవ్వని ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న బిక్కునాథ్‌నాయక్‌

విర్యాలగూడ టౌన, మే 20: దే శంలో పంచాయతీలకు పైసా ఇవ్వని ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని గిరిజన మోర్చా జాతీ య కార్యవర్గ సభ్యు డు నేనావత బిక్కునాథ్‌నాయక్‌ ఆరోపించారు. శుక్రవా రం పట్టణంలోని బీ జేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండాలు, గ్రామాలను జీపీలుగా మార్చిన సీఎం కేసీఆర్‌ నయాపైసా విడుదల చేయకపోవడంతో సర్పంచులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. గిరిజన సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 12 శాతానికి పెం చుతానని ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్‌, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేననాయక్‌ ఆదేశాల మేరకు రాష్ట్రమం తా పర్యటిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 27 నియోజకవర్గాల్లో గిరిజన జనాభా 25 శాతానికి మించిందని, రానున్న ఎన్నికల్లో గిరిజనులంతా కలిసి టీఆర్‌ఎ్‌సకు బుద్ధి చె ప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరా వు, జిల్లా కార్యదర్శి బానావత రతనసింగ్‌నాయక్‌, నియోజకవర్గ కన్వీనర్‌ కనపర్తి స త్యప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు దొండపాటి వెంకట్‌రెడ్డి, రాజశేఖర్‌, బాలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-21T06:34:19+05:30 IST