ప్రభుత్వం పట్టించుకోలేదని..

ABN , First Publish Date - 2022-05-15T05:36:51+05:30 IST

రోడ్డంతా పాడైంది. వాహనాలు కూడా తిరగలేని పరిస్థితి. గోతులైనా పూడ్చాలని అధికారులు విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేసింది. దీంతో ఆ గ్రామస్థులంతా ప్రభుత్వంపై ఆశలు వదిలేసుకున్నారు. గ్రామమంతా కలిసికట్టుగా రోడ్డు గాగు చేసుకున్నారు.

ప్రభుత్వం పట్టించుకోలేదని..
స్వచ్ఛందంగా రహదారిని బాగు చేసుకుంటున్న కిట్టాలపాడు గ్రామస్తులు

వారే రోడ్డు బాగు చేసుకున్నారు
హిరమండలం, మే 14 :
రోడ్డంతా పాడైంది. వాహనాలు కూడా తిరగలేని పరిస్థితి. గోతులైనా పూడ్చాలని అధికారులు విన్నవించారు. అయినా వారు పట్టించుకోలేదు. ప్రభుత్వం కూడా రోడ్ల అభివృద్ధిని గాలికొదిలేసింది. దీంతో ఆ గ్రామస్థులంతా ప్రభుత్వంపై ఆశలు వదిలేసుకున్నారు. గ్రామమంతా కలిసికట్టుగా రోడ్డు గాగు చేసుకున్నారు. మండలంలోని కిట్టాలపాడు గ్రామం నుంచి సీది వరకు 3 కిలోమీటర్ల మెటల్‌ రోడ్డు గుంతలమయమైంది. వాహనాలు రాకపోకలకు వీలు లేకుండా పోయింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారులకు తెలిపినా నిర్లక్ష్యం వహించారు. దీంతో గ్రామస్థులంతా రోడ్డును బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 15 మంది ట్రాక్టర్‌ యజమానులతో పాటు ఎక్స్‌కవేటర్‌, డోజరు యజమానులు వీరికి సహకరించారు. రెండు రోజులుగా రోడ్డుపై మట్టి, కంకర వేసి బాగుచేసుకున్నారు.
 
కమిషన్‌ చైర్మన్‌ వస్తున్నారని..
మెళియాపుట్టి : అధికారులు మూడేళ్లుగా ఆ గ్రామాల రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కళ్లు మూసుకున్నారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌  చైర్మన్‌ కంబ రవిబాబు వస్తున్నారని కొండపైన ఉన్న గ్రామాల రోడ్లకు మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 17న కొండపైన ఉన్న చందగిరి గ్రామాన్ని చైర్మన్‌ సందర్శించనున్నారు. దీంతో అధికారులు హడావుడిగా శనివారం నుంచి రోడ్డు పనులు చేపట్టారు. ఈ రోడ్డకు టీడీపీ హయాంలో రూ.80 లక్షలు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.కోటి మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. ఇప్పుడు ఈ పనులు ఎంత వరకు చేస్తారో వేచిచూడాలి.

Updated Date - 2022-05-15T05:36:51+05:30 IST