దాతల.. దాతృత్వం!

ABN , First Publish Date - 2020-04-10T11:20:39+05:30 IST

కరోనా వైర స్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున పూర్తిస్థాయి కర్ఫ్యూ నెలకొంటుంది.

దాతల.. దాతృత్వం!

ఆపదలో ఆదుకుంటున్న ఆపన్నహస్తాలు

పేదలను ఆదుకుంటున్న ప్రభుత్వం, దాతలు

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేయూత

నిరుపేదలకు అండగా నిలుస్తున్న సహృదయులు

పీఎం, సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

ఇప్పటి వరకు రూ.20 లక్షల వరకు విరాళం

 నిత్యం నిత్యావసర సరుకులు సానిటైజర్లు, మాస్క్‌ల పంపిణీ

ప్రభుత్వం తరఫున ఉచిత బియ్యం పంపిణీతో ఊరట


కామారెడ్డి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కరోనా వైర స్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున పూర్తిస్థాయి కర్ఫ్యూ నెలకొంటుంది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు మూతపడ్డా యి. ప్రభుత్వరంగ సంస్థలు సైతం మూసి ఉంటు న్నాయి. దీంతో ప్రభుత్వానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు నష్టం వాటిల్లుతోంది. రోజు కూలీనాలి పనిచేస్తే కానీ పూట గడవని ఎన్నో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నాయి. వారిని ఆదుకునేం దుకు జిల్లాలోని పలువురు వ్యాపారవేత్తలు, రాజకీ య నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భారీగా విరాళాలను అందజేస్తున్నారు. ఉమ్మ డి జిల్లాల మంత్రి ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో కలెక్టర్‌కు రూ.5లక్షల నగదు అందజేశారు. పట్టణం లోని చాట్ల బీడీ కంపెనీ యజమాని ఉపేందర్‌ రూ.5 లక్షల చెక్కును ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ సీఎం సహాయనిధికి మంత్రి కేటీఆర్‌కు అందజేశా రు. మాజీ ఎమ్మెల్యే జనార్థన్‌గౌడ్‌ మూడు లక్షల చెక్కును కలెక్టర్‌ శరత్‌కు అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి రూ.లక్ష చెక్కు ను కలెక్టర్‌కు ఇచ్చారు. భారత స్వాభిమాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో రూ.51వేల చెక్కును కలెక్టర్‌కు అందజే శారు. ఓ రైతు దంపతుడు రూ.10 వేల చెక్కును విరాళంగా ఇచ్చారు. ఇలా పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆదుకునేం దుకు విరాళాలను తమకు తోచినంత ప్రధాన మంత్రి, సీఎం సహాయనిధికి సమర్పిస్తు న్నారు.


నిత్యావసర సరుకులు, సానిటైజర్ల పంపిణీ

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున పేద, మధ్య తర గతి ప్రజలు తిండి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పలువురు దాతలు స్వచ్ఛంద సంస్థ లు, రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలకు, అడ్డా కూలీలకు పట్టణాల్లో, మండలాల్లో ఆయా గ్రామాల్లోనూ ఉచితంగా భోజనాన్ని ప్రతిరోజూ అం దజేస్తున్నారు. అదేవిధంగా పలువురు నిత్యావసర సరుకులను సైతం నిత్యం పేద కుటుంబాలకు, కరో నాపై పోరాడుతున్న పారిశుధ్య కార్మికులకు, ఆశ వర్కర్లకు, వైద్య సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. దీంతో పాటు లాక్‌డౌన్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న పో లీసులకు, ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఉచితంగా సానిటైజర్లను, మాస్క్‌ లను పంపిణీ చేస్తున్నారు.


జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో కామా రెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచితంగా భోజన పంపిణీతో పాటు వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయగా బాన్సువాడ పట్టణంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేలు వారి వారి నియోజకవర్గాల్లో, మండలాల్లో నిత్యావసర సరుకులను పేదలకు అందజే స్తున్నారు. కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ నిట్లు జాహ్నవి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రూ.2 లక్షల విలువ చేసే  సానిటైజర్లు, మాస్క్‌లు అందజేశారు. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ పిప్పిరి సుష్మ వెంకట్‌ ఆధ్వర్యంలో ప్రతీ రోజు నిరుపేదలకు ఉచితంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. అంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో రూ.5లక్షల విలువ చేసే, బాంబే క్లాత్‌ ఆధ్వర్యంలో రూ.2లక్షలు, కిసాన్‌ క్లాత్‌ షోరూం ఆధ్వర్యంలో ఉచితంగా నిత్యావసర సరుకులను సానిటైజర్లను, మాస్క్‌లను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ నాయకులు వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. 


పేదలకు ఊరటనిచ్చిన ఉచిత రేషన్‌ బియ్యం

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేద ప్రజలు వలస కూలీలు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ వైపు చేసేందుకు పనులు లేక మరోవైపు తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి 12 కేజీల బియ్యం ఉచిత పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ ఉచిత బియ్యం పంపిణీ పేద, మధ్య తరగతి కుటుంబాలకు కాస్తా ఊరటనిచ్చింది. జిల్లాలో లాక్‌డౌన్‌ సందర్భంగా రేషన్‌ దుకాణాల ద్వారా 10,200 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 8.73లక్షల కార్డు దారులకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 10వేల టన్నుల బి య్యాన్ని 577 రేషన్‌ దుకాణల ద్వారా 9.72 లక్షల మందికి పౌరసరఫరాల శాఖ అధికారులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాలో ఉన్న సుమారు 2 వేలకు పైగా వలస కూలీలకు ఉచితంగా 12 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇలా జిల్లాలో లాక్‌డౌన్‌ సందర్భంగా నిరుపేద ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు దాతలు ముందుకు వచ్చి బియ్యాన్ని, సరుకులను పంపిణీ చేస్తున్నందుకు పలువురు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Updated Date - 2020-04-10T11:20:39+05:30 IST