దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-30T06:56:49+05:30 IST

దళితుల సంక్షేమమే లక్ష్యం గా ప్ర భుత్వం పనిచేస్తుందని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇనచార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు.

దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రవీందర్‌రావు

మునుగోడు రూరల్‌, సెప్టెంబరు 29: దళితుల సంక్షేమమే లక్ష్యం గా ప్ర భుత్వం పనిచేస్తుందని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇనచార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని పలు గ్రా మాల్లో సహపంక్తి భోజనాలు, ఆత్మీయ కుటుంబ సమ్మేళనాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు, మూడు స్థానాలకు పరిమిత మవుతాయని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దళితుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధి కోసం దళితబంధు అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. బీజేపీకి ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నల్లగొండ మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కటికం సత్తయ్యగౌడ్‌, ఎంపీ పీ కర్నాటి స్వామియాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, బోయపాటి సురేందర్‌, పంతంగి స్వామి, అందుగుల కృష్ణ తదితరులు ఉన్నారు. 

నాంపల్లి: దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. మండలంలోని నాంపల్లి, మేళ్లవాయి, మల్లపురాజుపల్లి గ్రామాల్లోని దళిత కుటుంబాల ఆత్మీయ సమ్మేళన వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం దళితులకు అనేక పథకాలు పెట్టి పెద్దపీట వే స్తుందని, కళ్యాణలక్ష్మి పథకం కూడా మొదట దళితులకే ప్రారంభించిందన్నారు. దళితబంధు ద్వారా రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీ పీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ పానగంటి రజిత వెంకన్నగౌడ్‌, ఎంపీటీసీలు బత్తుల వంశీ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-30T06:56:49+05:30 IST