ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-19T04:48:46+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) జనరల్‌ మేనేజర్‌ బి.నాగప్రసాద్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరం వేదికగా మునిసిపల్‌ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణను బుధవారం ప్రారంభించారు.

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయం
ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి హెల్త్‌కార్డు అందిస్తున్న దృశ్యం

- ఆప్కాస్‌ జీఎమ్‌ నాగప్రసాద్‌
అరసవల్లి, మే 18 :
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) జనరల్‌ మేనేజర్‌ బి.నాగప్రసాద్‌ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిరం వేదికగా మునిసిపల్‌ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు నేరుగా పరిష్కరించేలా అన్ని జిల్లాల్లో గ్రీవెన్స్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, విశాఖల్లో గ్రీవెన్స్‌ నిర్వహించినట్టు చెప్పారు. కాగా బుధవారం తొలిరోజు పలువురు మునిసిపల్‌, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలకు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల  నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం మునిసిపల్‌ ఉద్యోగులకు ఈఎస్‌ఐ హెల్త్‌కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జె.రామప్పలనాయుడు, ఆప్కాస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T04:48:46+05:30 IST