కార్మిక హక్కుల సాధనే లక్ష్యం

ABN , First Publish Date - 2020-07-06T10:53:58+05:30 IST

కార్మికుల హక్కుల సాధనే ఏఐటీయూసీ లక్ష్య మని జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు

కార్మిక హక్కుల సాధనే లక్ష్యం

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు


మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 5: కార్మికుల హక్కుల సాధనే ఏఐటీయూసీ లక్ష్య మని జిల్లా కార్యదర్శి మేకల దాసు పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయం లో జిల్లాలోని రైస్‌మిల్లులకు చెందిన 48 మంది హమాలీ కార్మికులు ఏఐటీ యూ సీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసమే తమ పోరాటాలు ఉంటాయని, వారికి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పిం చాలన్నారు. జిల్లా అసంఘటిత కార్మికులను లేబర్‌ అధికారులు పట్టించుకోవడం లేదని, వారికి సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయని విమర్శించారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్ర పన్నుతోం దన్నారు. హమాలీ కార్మికుల కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా మేకల దాసు, అఽధ్యక్షుడిగా మల్లేష్‌, ఉపాధ్యక్షుడు, కార్యదర్శులుగా దర్ముల మల్లేష్‌, పెండం కుమార్‌, చొప్పరివేణులను ఎన్నుకున్నారు. సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ఖాన్‌, బండారి లింగయ్య, వనం సత్యనారాయణ, మహేందర్‌ రెడ్డి, పౌలు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:53:58+05:30 IST