సమగ్ర అభివృద్ధే ధ్యేయం

ABN , First Publish Date - 2022-01-27T06:21:33+05:30 IST

జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

సమగ్ర అభివృద్ధే ధ్యేయం
పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి

 ఘనంగా గణతంత్ర వేడుకలు


భువనగిరి రూరల్‌, జనవరి 26: జిల్లా సమగ్ర అభివృద్ధే ధ్యేయమని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా జిల్లా ప్రజలంతా భౌతికదూరం పాటించి, మాస్కులు ధరించి సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని కాంక్షించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు సంస్థాన్‌నారాయణపురం మండలం ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాములు, తుర్కపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన ఫారెస్టు బీట్‌ అధికారి బి వకుల కుమారి, భువనగిరి మండలం రాయిగిరి ఫారెస్టు బీట్‌ అధికారి పి.శ్రీనివాస్‌, తుర్కపల్లి మండలం వాసాలమర్రి ఫారెస్టు బీట్‌ అధికారి కె.మల్లేశ్‌, బొమ్మలరామారం మండలం ఫారెస్టు బీట్‌ అధికారి ఎన్‌.పురుషోత్తంలకు ఉత్తమ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి శ్రీనివా్‌సరెడ్డి, దీపక్‌తివారీ, ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీపీ కె.నారాయణరెడ్డి, భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్‌ రెడ్డి, డీఏవో మందడి ఉపేందర్‌రెడ్డి, ఏసీపీ ఎస్‌ వెంకట్‌రెడ్డి, డీఎ్‌ఫవో వెంకటేశ్వర్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో రామూర్తి, తహసీల్దార్‌ కె.వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-27T06:21:33+05:30 IST