పేదలకు ఉచిత వైద్యం అందించటమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-01-24T05:15:08+05:30 IST

పేదలకు ఉచిత వైద్యం అందించటమే లక్ష్యం

పేదలకు ఉచిత వైద్యం అందించటమే లక్ష్యం
వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌

  • చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి

ధారూరు, జనవరి 23 : గ్రామీణ పేద ప్రజలకు ఉచితంగా వైద్యసేవలను అందించాలన్న ఉద్దేశ్యంతో ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మోమిన్‌కలాన్‌ గ్రామంలో మొట్టమొదటిగా ఉచిత వైద్యశిబిరం ప్రారంభించామని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి గ్రామంలో  ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పదవులు, రాజకీయాల కన్నా  ఇలాంటి సేవలు తనకు సంతృప్తిని కలిగిస్తాయని, ఇది తన అదృష్టంగా భావిస్తానని  అన్నారు. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో వారానికి, 15 రోజులకోసారి వైద్యబృందం వచ్చి ఉచిత సేవలందిస్తారని ఆయన తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ పట్ల అపోహలు వద్దని, వైద్యంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా రొమ్ము కాన్సర్‌ వస్తుందని, రొమ్ములో ఏ చిన్నగడ్డలా అనిపించినా పరీక్షలు చేసిన తర్వాత చికిత్స చేయించుకోవాలని సూచించారు. కొవిడ్‌ వాక్సినేషన్‌ వేయించుకుంటే సంతానం కలగదనే ప్రచారంలో వాస్తవం లేదని  అన్నారు. ఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించి పేదలకు వైద్యం అందిస్తున్న ఎంపీకి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, జిల్లా వాలీబాల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు జె.హన్మంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వై.సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, టీఆర్‌ఎ్‌సవీ జిల్లా ఇన్‌చార్జి కుమ్మరి శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ సంతో్‌షకుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, శ్రీపతిరెడ్డి, రాజుగుప్త, వైద్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

  • ఎస్జీటీయూ క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

వికారాబాద్‌, జనవరి 23 : సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయ సంఘం (ఎస్జీటీయూ) వికారాబాద్‌ జిల్లా నూతన క్యాలెండర్‌ను ఆదివారం పట్టణంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఆ సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాపన్నోళ్ల శ్రీనివా్‌సరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్‌, రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు వీరేశం, కోశాధికారి నర్సింలు, జిల్లా కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, ఆరిఫ్‌, వికారాబాద్‌ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌, అనిల్‌, రఘు, మదన్‌, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:15:08+05:30 IST