మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
వికారాబాద్‌ : సాయిబాబాను దర్శించుకుంటున్న ఎమ్మెల్యే, కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి

  • వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌/ధారూరు, మే 27 :  పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌నగర్‌ సమీపంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో రూ.75 లక్షల అంచనాతో నిర్మిస్తున్న రేడియాలజీ ల్యాబ్‌ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలి

ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని గుడుపల్లి గ్రామంలో  మీతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పైపులైన్‌కు గేట్‌వాల్వు ఏర్పాటుచేసి ప్రజలు చెర్రలు తీయకుండా, నీటిని వాడుకోవాలన్నారు. వారానికి ఒకరోజు వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేయాలన్నారు. ఎక్కడ లీకేజీలు లేకుండా మిషన్‌ భగీరథ నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కొత్త స్తంభాలు ఏర్పాటుచేసి విద్యుత్‌ సరఫరా చేయాలని, పంట పొలాల్లో వేలాడుతున్న కరెంట్‌ తీగలు సరిచేయాలని, అంతరాయం లేకుండా విద్యుత్‌ అందించాలన్నారు. అనంతరం ఇంటింటికీ తిరిగి మా ఇంటికి రండి కార్యక్రమంలో భాగంగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ సంతోష నర్సిములు, మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజులా రమేష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, తదితరులున్నారు.

  • భగవంతుడి కృపతో ప్రజలు క్షేమంగా ఉండాలి

భగవంతుడి కృపతో ప్రజలు క్షేమంగా ఉండాలని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శుక్రవారం వికారాబాద్‌ మునిసిపల్‌ పరిధిలోని సాకేత్‌నగర్‌ కాలనీలో గల శ్రీ సద్గురు సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించగా స్థానిక కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను దగ్గరుండి జరిపించారు. ఎమ్మెల్యేను, నాయకులను శాలువాలతో సత్కరించారు. నాయకులు, కాలనీవాసులు, భక్తులున్నారు.

  • అన్నదాతలను ఆదుకునేందుకే కొనుగోలు కేంద్రాలు

అన్నదాతలను ఆదుకునేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు. ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాగా దోర్నాల్‌ గ్రామంలో దళితబంధు లబ్ధిదారుడు అనంతయ్యకు మంజూరైన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్‌ఎంపీపీ విజయ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు రాజునాయక్‌, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వీరేశం, ఏఎంసీ చైర్మన్‌ సంతో్‌షకుమార్‌, వైస్‌చైర్మన్‌ ఎ.అంజయ్య, సర్పంచులు చంద్రమౌళి, సుజాత, వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST