అవినీతి నిర్మూలనే ధ్యేయం

ABN , First Publish Date - 2021-12-05T05:55:20+05:30 IST

అవినీతి నిర్మూలనే ప్రధాన ధ్యేయమని కలెక్టర్‌ రవి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించగా కలెక్టర్‌ హాజరై సిబ్బందిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.

అవినీతి నిర్మూలనే ధ్యేయం
అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌ , డిసెంబరు 4 : అవినీతి నిర్మూలనే ప్రధాన ధ్యేయమని  కలెక్టర్‌ రవి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించగా కలెక్టర్‌ హాజరై సిబ్బందిచే అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అవినీతి ని నిర్మూలించడంలో ప్రధాన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేసి ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, డీపీఆర్‌వో శ్రీధర్‌, ఎస్సీ వెల్ఫేరే అధికారి వరద రాజన్‌, సూపరింటెండెంట్లు నాగార్జున, విజ య లక్ష్మి, మధు, ఉదయ్‌ ఉన్నారు. అలాగే జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాల యంలో అవినీతి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించారు. భారతదేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించనని పోలీస్‌ సిబ్బంది అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్‌ దుర్గ, ఆర్‌ ఐ అడ్మిన్‌ వామనమూర్తి, డీపీవో కార్యాలయ సూపరింటెంట్లు శ్రీనివాస్‌, ధస్తగిరి, ఆర్‌ఎస్‌ఐ అనీల్‌ కుమార్‌ ఉన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని అ న్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అవినీతి నిర్మూలన ప్రతిజ్ఞ నిర్వహించారు.


Updated Date - 2021-12-05T05:55:20+05:30 IST