బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-08-15T05:02:37+05:30 IST

బడుగుబలహీనవర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయం

 కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 14: బడుగుబలహీనవర్గాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బి వినోద్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమపౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని సీతారాంపూర్‌లో 75 లక్షల రూపాయలతో నిర్మించిన పద్మశాలి సంఘం హాస్టల్‌ భవనాన్ని వినోద్‌కుమార్‌, గంగుల కమలాకర్‌ుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రతి కుల సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం హైదరాబాద్‌లో స్థలాన్ని కేటాయించారన్నారు. 75 ఏళ్లుగా ఈ ఆలోచన ఏ ప్రభుత్వానికి, ఏ నాయకుడికి రాలేదన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పద్మశాలి కులస్థులకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కార్పొరేటర్‌ జంగిలి సాగర్‌, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, నాయకులు మెతుకు సత్యం, మోర రాజేశం, వాసాల రమేశ్‌, వంగల రవీందర్‌, వేముల విష్ణుమూర్తి, సత్యనారాయణ, రవి పాల్గొన్నారు. 

-లక్ష్యసాధన కోసం ప్రణాళికాబద్ధంగా చదవాలి 

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం కరీంనగర్‌ బాల గోకులంలో వెంకట్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి 10 జీపీఏ సాధించిన 32 మంది మెరిట్‌ విద్యార్థులకు గోల్డ్‌మెడల్‌, సర్టిఫికెట్లను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 10 జీపీఏ సాధించిన విద్యార్థులను మంత్రి అభినందిస్తూ ఇదే స్పూర్తితో ఉన్నత విద్యనభ్యసించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు ఐలేందర్‌ యాదవ్‌, తోట రాములు, డీఈవో జనార్దన్‌రావు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్‌, డాక్టర్లు రఘురామన్‌, అజయ్‌ ఖండల్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ముక్క హరీష్‌బావు, వెంకట్‌ పౌండేషన్‌ అధ్యక్షుడు గంప వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-15T05:02:37+05:30 IST