ఘనంగా ఉట్లమాను ఉత్సవం

ABN , First Publish Date - 2022-05-23T06:24:07+05:30 IST

మండలకేంద్రంలో వెలసిన గంగాభవానీ దేవత ఉత్సవా ల్లో భాగంగా చివరి రోజు ఆదివారం ఉట్లమాను మ హోత్సవం కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు.

ఘనంగా ఉట్లమాను ఉత్సవం
ఉట్లమాను ఎక్కడానికి పోటీ పడుతున్న యువకులు


గాండ్లపెంట, మే 22: మండలకేంద్రంలో వెలసిన గంగాభవానీ దేవత ఉత్సవా ల్లో భాగంగా చివరి రోజు ఆదివారం ఉట్లమాను మ హోత్సవం కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు. ఆల యంలో తెల్లవారుజా మున భక్తులు అమ్మవారికి జ్యోతు లు, బోనాలను సమర్పించా రు. సాయంత్రం  నిర్వాహ కులు ఉట్ల మాను ఏర్పాటు చేశారు. మాను ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. ఈ ఉత్సవాన్ని తిలకించడాని కి  గ్రామస్థులతో పాటు పరి సర ప్రాంతాల వాసులు అఽధిక సంఖ్యలో తరలివచ్చా రు. చివరి రోజు పిల్లలు ఆట వస్తులు, మహిళలు గాజులు, తినుబండారాలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. 


Updated Date - 2022-05-23T06:24:07+05:30 IST