Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా ఏడు గంగమ్మల జాతర చాటింపు

శ్రీకాళహస్తి, డిసెంబరు 5: శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ఏడు గంగమ్మల జాతర ఈనెల 8వతేది నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘనంగా జాతర చాటింపు నిర్వహించారు. పట్టణ పరిధిలో ఏడు గంగమ్మలు కొలువుదీరే ప్రాంతాలను నిర్వాహకులు విద్యుత్తు దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. తరలి వచ్చిన భక్తులు, తప్పెట్లమోతలతో సాయంత్రం నుంచే అమ్మవార్ల ఆలయ ప్రాంతం సందడిగా మారింది. 

Advertisement
Advertisement