Abn logo
Feb 22 2020 @ 01:37AM

అమ్మాయిలూ జాగ్రత్త...

నవీన్‌.కె.చారి, ప్రియాన్ష. మేఘన చౌదరి, సుమాయ, కావ్య, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా వడ్ల జనార్థన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హలో మేడమ్‌’. వడ్ల గురురాజ్‌, వడ్ల కార్తీక్‌ నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా లోగోను ఫిల్మ్‌ చాంబర్‌లో దర్శకుడు సాగర్‌, ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆవిష్కరించారు. వడ్ల జనార్థన్‌ మాట్లాడుతూ ‘‘సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దాడులు ఆధారంగా రూపొందుతున్న సినిమా ఇది. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలనే సందేశమిస్తున్నాం. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement