ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా

ABN , First Publish Date - 2022-06-29T06:11:00+05:30 IST

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు 2022 ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్స రాల్లో బాలికలే పైచేయి సాధించారు.

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే హవా
తాడూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విజయచిహ్నం చూపుతున్న విద్యార్థులు, అధ్యాపకులు

- రాష్ట్రంలో నాగర్‌కర్నూల్‌కు 

మొదటి సంవత్సరంలో 28.. 

ద్వితీయ సంవత్సరంలో 33వ స్థానం

 - జిల్లాలో ప్రథమ సంవత్సరం

    53శాతం, ద్వితీయంలో 

    56శాతం ఉత్తీర్ణత

- ఒకేషనల్‌లో ప్రథమ 53, 

   ద్వితీయ 63శాతం

- ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ

  కళాశాలల విద్యార్థులు

 నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 28: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు 2022 ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్స రాల్లో బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం లో జనరల్‌ మొత్తం 6051 విద్యారులు పరీక్షలు రాయగా 3232 మంది  (53శాతం) ఉత్తీర్ణత సాధించారు. అందులో 2721 మంది బాలురకు గాను 1114 మంది (40శాతం) పాసవగా, బాలికల్లో 3330లో  2118 మంది (63శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జనరల్‌ విద్యార్థుల్లో 2653 మంది బాలురకు గాను 1192 మంది (44శాతం) పాసవగా, బాలికల్లో 3108లో 2049 మంది (65శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాగా రాష్ట్ర స్థాయిలో ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రథమ సంవత్సరం 28వ స్థానంలో, ద్వితీయ సంవత్సరం 33వ స్థానంలో నిలిచింది.

 ఒకేషనల్‌ ఫలితాల్లో మెరుగైన స్థానం

  ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ ఫలితాల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రథమ, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థుల కంటే ఒకేషనల్‌ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ ప్రథమ సంవత్సరంలో 1432 మంది విద్యార్థులకు గాను 767 మంది (53 శాతం) ఉత్తీర్ణత సా ధించి రాష్ట్ర స్థాయిలో 19వ స్థానంలో నిలిచారు. అలాగే ఒకేషనల్‌ ద్వితీ య సంవత్సరంలో 1065 మంది విద్యార్థులకుగాను 681 మంది (63శా తం) ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 15వ స్థానం సంపాదించారు. ఇం టర్‌ ఒకేషనల్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కు వ మంది పాసై పైచేయి సాధించారు. 

 జిల్లా స్థాయిలో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ప్రతిభ 

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పలువురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథ మ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో కొల్లాపూర్‌ ప్ర భుత్వ జూనియర్‌ విద్యార్థినీ ఎం.నిఖిత 963 మార్కులు సాధించగా, బైసీ సీలో పాలెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని జి.సంధ్య 943 మా ర్కులు సాధించి జిల్లా స్థాయి ప్రథ మ స్థానంలో నిలిచారు. అలాగే ప్రథమ సంవత్సరం ఎంపీసీలో పా లెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని ఎ.లావణ్య 462 మార్కు లు, బైపీసీలో కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని పూ జ 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ప్రథమస్థానం పొందారు.



Updated Date - 2022-06-29T06:11:00+05:30 IST