సలసల మరిగే నూనె పడి 3 ఏళ్ల పాపకు తీవ్ర గాయాలు.. కొబ్బరి నూనె రాస్తే చాలని వైద్యుడు చెప్తే అలాగే చేశారు.. కానీ మర్నాడే..

ABN , First Publish Date - 2022-02-12T17:47:35+05:30 IST

3 సంవత్సరాల కుమార్తె మరుగుతున్న నూనెలో...

సలసల మరిగే నూనె పడి 3 ఏళ్ల పాపకు తీవ్ర గాయాలు.. కొబ్బరి నూనె రాస్తే చాలని వైద్యుడు చెప్తే అలాగే చేశారు.. కానీ మర్నాడే..

3 సంవత్సరాల కుమార్తె మరుగుతున్న నూనెలో పడినప్పుడు  ఆ తండ్రి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. బాలికను కోటా మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించడంలో.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుమార్తెను అడ్మిట్ చేశాడు. అక్కడ ఫీజు కట్టేందుకు ఇంటిని తాకట్టు పెట్టాడు. అప్పటికీ డబ్బు తక్కువగా ఉండటంతో కొంతమంది దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. తన బైక్‌ను తాకట్టు పెట్టి కూడా డబ్బు సర్దుబాటు చేశాడు. బాలికకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. కాళ్లు, ఛాతీ, చేతులపై తీవ్రమైన గాయాలయ్యాయి. కుమార్తెకు అత్యవసరమైనప్పుడు వైద్యులు ఆ తండ్రి చర్మాన్ని.. కుమార్తెకు చికిత్సలో భాగంగా వినియోగించారు. జనవరి 13న ఆ చిన్నారికి మొదటి ఆపరేషన్‌, జనవరి 29న రెండో ఆపరేషన్‌ చేశారు. ఎట్టకేలకు ఆ బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ ఉదంతం రాజస్థాన్ లోని కోటాలోని జగ్‌పురా ప్రాంతంలో చోటుచేసుకుంది. జగ్‌పురా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న విష్ణు కుమార్తె కుమార్తె గుంజన్(3) డిసెంబర్ 20 న  ఆడుకుంటూ నూనె పాత్రలో పడిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు బాధిత చిన్నారిని  దగ్గరలోని ప్రైవేట్ క్లినిక్ కి తీసుకెళ్లారు. 


ఆ వైద్యుడు కొబ్బరి నూనె రాస్తే అంతా సద్దుకుంటుందని చెప్పాడు. అయితే రెండో రోజుల తర్వాత ఆ చిన్నారి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు డిసెంబర్ 24న ఆ చిన్నారిని వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితిని చూసి డాక్టర్‌ అడ్మిట్‌ చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో బాలికను తల్వండిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కూతురు ప్రాణాలను కాపాడేందుకు తండ్రి విష్ణు తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టాడు. విష్ణు జగ్‌పురాలోని ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న తండ్రి.. కుమార్తెకు ప్రయివేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించేందుకు అష్టకష్టాలు పడ్డాడు. ఈ సందర్భంగా బాలికను రక్షించడం చాలా కష్టమని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అలోక్ గార్గ్ తెలిపారు. బాలిక 40 శాతానికి పైగా కాలిపోయిందని తెలిపారు. బాలిక తుంటి, కాలు, ఛాతీ, చేతులపై గాయాలయ్యాయి. అటువంటి పరిస్థితిలో బాలిక కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సెప్టిసిమియా పరిస్థితిలో బాలికను తీసుకువచ్చారు. ముందుగా గాయాలను శుభ్రం చేసి, ఫస్ట్ ఎయిడ్ చేశాం. పాప బరువు 10 కిలోలు. చర్మం తీవ్రంగా కాలిపోయింది. తండ్రి చర్మాన్ని సేకరించి, శిశువుకు చికిత్స చేశాం. పేదవాడి కూతురిని కాపాడాలని నిశ్చయించుకున్నాం. ఫలితంగా కొద్దిరోజుల్లోనే  బాలిక  గాయాలు కూడా తగ్గుముఖం పట్టాయి. నొప్పి నుండి ఉపశమనం కలగడంతో ఆ చిన్నారి ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. ఫలితంగా వేగంగా కోలుకుంది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తండ్రి విష్ణు వర్మ తెలిపారు. గ్రామంలో ఒక ఇల్లు ఉందని, దానిని తనఖా పెట్టానని తెలిపాడు. ఆసుపత్రి వైద్యుడు కూడా సహాయం చేశారని తెలిపారు. చికిత్స సమయంలో తమ పరిస్థితి చాలా దారుణంగా మారిందని, తిండికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. కుమార్తె కోసం తన పాదాల నుండి చర్మం ఇవ్వాల్సి వచ్చిందని. తాను కోలుకోవడానికి నెల రోజులు పడుతుందని, తన బిడ్డ పూర్తిగా కోలుకోవడానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని విష్ణు తెలిపాడు. 



Updated Date - 2022-02-12T17:47:35+05:30 IST