Abn logo
Feb 22 2020 @ 01:29AM

సరోగసీ ద్వారా అమ్మాయి పుట్టింది

‘‘మా ఇంటి లక్ష్మి వచ్చింది. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసింది’’ అని హిందీ నటి శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న తమకు అమ్మాయి పుట్టిందని శుక్రవారం (ఫిబ్రవరి 21న) ప్రకటించారు. వీరు సరోగసీ ద్వారా సంతానాన్ని పొందారు. ఇప్పుడీ అమ్మాయి వీరికి రెండో సంతానం! ఏడేళ్ల క్రితం మగబిడ్డ వియాన్‌కు శిల్పా శెట్టి జన్మనిచ్చారు. పాపాయికి ‘సమిశా శెట్టి కుంద్రా’ అని పేరు పెట్టినట్టు శిల్ప-రాజ్‌ దంపతులు తెలిపారు. ‘స’ అంటే సంస్కృతంలో ‘కలిగి ఉండడం’ అని అర్థం. ‘మిశా’ అంటే రష్యన్‌లో ‘దేవత లాంటి వ్యక్తి’ అని అర్థం. ‘దేవత లాంటి వ్యక్తిని కలిగి ఉన్నాం’ అని అర్థం వచ్చేలా పేరు పెట్టారన్నమాట! ‘‘ఓం శ్రీ గణేశాయ నమః మా ప్రార్థనలు ఫలించి అద్భుతం జరిగింది. మా హృదయాలు కృతజ్ఞతతో నిండాయి. మా ఇంటికి లక్ష్మి వచ్చిందని చాలా సంతోషంగా ప్రకటిస్తున్నాం! ఇట్లు, ఆనంద పారవశ్యంలో మునిగి తెలుతున్న తల్లితండ్రులు రాజ్‌, శిల్పా శెట్టి కుంద్రా. అమితానందంతో ఎంజాయ్‌ చేస్తున్న అన్నయ్య వియాన్‌’’ అని శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement