ప్రేమికుడు దక్కడేమోనని బాలిక ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-02-02T00:40:05+05:30 IST

ప్రేమికుడు తనకు దక్కడేమోనని భయంతో ఇంట్లో ఉరేసుకుని ఓ బాలిక

ప్రేమికుడు దక్కడేమోనని బాలిక ఆత్మహత్య

కామారెడ్డి: ప్రేమికుడు తనకు దక్కడేమోనని భయంతో ఇంట్లో ఉరేసుకుని ఓ బాలిక(17) ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో జరిగింది. అశోక్‌నగర్ కాలనీకి చెందిన భరత్, ముశ్రీఫ్ బాగ్ కాలనీకి చెందిన బాలిక మధ్య  ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీంతో ఇరుకుటుంబాలకు తెలిసి వయసు లేదని, 3 సంవత్సరాలు దూరంగా ఉండాలని పెద్దలు నచ్చజెప్పారు. అయితే భరత్ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నాడని, అతనికి దూరంగా ఉండాలని ఆ బాలికను వాట్సప్ ద్వారా మరో అమ్మాయి బెదిరించింది. ఆ అమ్మాయి, భరత్ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు పంపడంతో తనకు భరత్ దక్కడేమోనని ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక చావుకు కారణం అయిన భరత్, ఆ అమ్మాయిని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

Updated Date - 2022-02-02T00:40:05+05:30 IST