దారెల మహిళల ఔదార్యం

ABN , First Publish Date - 2022-05-29T06:22:55+05:30 IST

ఎండ వేడికి తాళలేక దాహంతో విలవిలలాడిపోతున్న పాదచారులు, వాహన చోదకులు, ప్రయాణికుల దాహం తీర్చేందుకు దారెల మహిళలు శ్రీకారం చుట్టారు.

దారెల మహిళల ఔదార్యం
పాదచారులకు మజ్జిగ నిమ్మరసం అందిస్తున్న దారెల మహిళలు



 సొంత డబ్బులతో నిమ్మరసం, మజ్జిగ పంపిణీ

ముంచంగిపుట్టు, మే 28: ఎండ వేడికి తాళలేక దాహంతో విలవిలలాడిపోతున్న పాదచారులు, వాహన చోదకులు, ప్రయాణికుల  దాహం తీర్చేందుకు దారెల మహిళలు శ్రీకారం చుట్టారు. శనివారం మండల కేంద్రంలో వారపు సంతకు వచ్చే వాహనదారులు, పాదచారుల దాహం తీర్చేందుకు కిలగాడ జంక్షన్‌ వద్ద మజ్జిగ, నిమ్మరసాన్ని పంపిణీ చేశారు. అటుగా రాకపోకలు సాగించే బస్సులు, ఆటోలు, జీపులు, ద్విచక్ర వాహనాలతోపాటు పాదచారులను ఆపి వారికి మజ్జిగ, నిమ్మరసం అందిస్తూ దాహం తీర్చారు. ఉచితంగా వందలాది మందికి దాహం తీర్చిన దారెల మహిళలను పలువురు అభినందించారు. 

Updated Date - 2022-05-29T06:22:55+05:30 IST