కాఫీ రైతులకు జీసీసీ గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-19T06:19:51+05:30 IST

కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గిరిజన సహకార సంస్థ కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.

కాఫీ రైతులకు జీసీసీ గిట్టుబాటు ధర కల్పించాలి
అపెక్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తదితరులు


అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి  భాగ్యలక్ష్మి 

పాడేరు, అక్టోబరు 18: కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గిరిజన సహకార సంస్థ కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన  అపెక్స్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. కాఫీ రైతులకు జీసీసీ అందిస్తున్న ధరలపై సంతృప్తి లేదన్నారు. అలాగే లక్ష్యం మేరకు కాఫీ గింజల కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులకు మేలు జరగదన్నారు. 2020-21 సంవత్సరంలో 1,500 టన్నుల కాఫీ గింజల కొనుగోలుకు కేవలం 200 టన్నులు మాత్రమే కొనుగోలు చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాఫీ కొనుగోలుకు గతంలో నియమించిన సిబ్బందిని తొలగించడం వల్ల కొనుగోలు లక్ష్యం చేరలేకపోయారని, వారిని తిరిగి నియమించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. జీసీసీ పనితీరు మెరుగుపర్చుకుని లక్ష్యం మేరకు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు. ఈకార్యక్రమంలో జీసీసీ ఎండీ పీఏ.శోభ, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రంజిత్‌బాషా, ట్రైకార్‌ ఎండీ రవీంద్రబాబు, ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ, జీసీసీ జీఎం జి.చినబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:19:51+05:30 IST