చెత్తబండి రాలేదోచ్‌..!

ABN , First Publish Date - 2022-08-20T04:59:48+05:30 IST

మదనపల్లె పురపాలికలో మొత్తం 35వార్డులు ఉండగా, రెండు విడతల్లో అన్ని వార్డుల్లోనూ చెత్తఆటోల ఏర్పాటును అధికారులు నిర్ణయించారు.

చెత్తబండి రాలేదోచ్‌..!
మున్సిపాలిటీలో నిలిపిన చెత్త సేకరణ ఆటోలు

 వేతనాలు అందక ఆటో డ్రైవర్లు  మళ్లీ  బ్రేక్‌

 పురపాలికలో ఆగిన ఇంటింటా చెత్తసేకరణ

చెత్తబండి వచ్చిందో.. చెత్తబండి వచ్చింది.. బుట్టలు తీసుకురండి.. అంటూ తెల్లారక ముందే చెవులు మార్మోగేలా వినిపించే చెత్తపాటల నినాదం మదనపల్లె పురపాలిక లో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు నిలిపివేయగా తాజాగా శుక్రవారం మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఆ వాహనాల డ్రైవర్లకు రెండు నెలలు గా వేతనాలు ఇవ్వడంలో జాప్యం నెలకొనడంతో వారంతా మూకు మ్మడిగా విధులు బహిష్కరించారు. దీంతో  చెత్తఆటోలు మున్సిపల్‌ కార్యాలయానికే పరిమితం కాగా, నివా సాలను చెత్తబుట్టలు ముంచెత్తు తున్నాయి.

మదనపల్లె, ఆగస్టు 19:మదనపల్లె పురపాలికలో మొత్తం 35వార్డులు ఉండగా, రెండు విడతల్లో అన్ని వార్డుల్లోనూ చెత్తఆటోల ఏర్పాటును అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి విడత 25 ఆటోలు మంజురుకాగా, 15 వాహనాలు అందుబాటు లోకి వచ్చాయి. అప్పటి నుంచి 15ఆటోలూ పట్టణంలోని తిరుగుతూ ఇంటింటా తడి, పొడి చెత్తనే సేకరిస్తున్నాయి. అయితే రెండునెలలు పూర్తయినా వేతనాలు రాలేదం టూ ఆటో డ్రైవర్లు బ్రేక్‌ వేశారు. దీంతో ఎక్కడి ఆటోలు అక్కడే ఆగిపోయాయి. క్లీన్‌ ఆంధ్రాప్రదేశ్‌(క్లాప్‌) కింద  రెడ్డిఎంటర్‌ ప్రైజెస్‌ అనే ప్రవేటు ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చెత్తసేకరణ బాధ్యతను తీసుకుంది. డ్రైవర్‌తో సహా ఆటోను సమకూరిస్తే, మున్సిపాలిటీ ఒక్కో ఆటోకు నెలకు రూ.60వేలు చెల్లిం చేలా ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే చెత్త వేసేందుకు మున్సిపాలిటీ ఇద్దరు కార్మి కులను కూడా ఆటో వెంటపంపుతోంది. ఇదిలావుండుగా, మున్సిపాలిటీ యూజర్‌ ఛార్జీలపేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ప్రైవేటు ఏజెన్సీ ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10,600 వేతనం ఇస్తుండగా, అందులో పీఎఫ్‌, ఈఎస్‌ఐ పోనూ రూ.9,600 ఇచ్చేలా ఒప్పందంతో డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంది. మూడో నెల జరుగుతున్నా.. మొదట్లోనే వేతనాలు జాప్యంపై డ్రైవర్లు మూకుమ్మడిగా ఆపేశారు. నెలరోజులుగా వేతనాలు అడుగుతుంటే, ఆగస్టు 11వేతేదీన వేస్తామని చెప్పిన ఏజెన్సీ..ఆ తర్వాత వేతనాలు పడకపోవడంతో 12నుంచి 14వ తేదీ వరకూ విధులు బహిష్కరించారు. తర్వాత మున్సిపల్‌ కమిషనర్‌  కె.ప్రమీల, డ్రైవర్లతో చర్చించి 18వ తేదీన ఖాతాలో పడేలా చూస్తానని హామీ ఇవ్వడంతో తిరిగి ఆగస్టు 15న విధుల్లోకి  వెళ్లారు. కమిష నర్‌  చెప్పినట్లు 18వతేదీన కూడా వేతనాలు పడకపోవడంతో 19న (శుక్రవారం) మళ్లీ రెండో సారి విధులు బహిష్కరించారు. ఇలా రెండు విడతలుగా ఇంటింటా చెత్తసేకరణకు బ్రేక్‌ పడింది. ఏప్రిల్‌ నుంచి స్వఛ్చాంధ్ర కార్పొరేషన్‌కు, అక్కడి నుంచి ఏజెన్సీకి నిధులు రాకపోవడంతో డ్రైవర్లకు వేతనాలు చెల్లింపులో జాప్యం అయినట్లు చెబుతున్నారు. 

Updated Date - 2022-08-20T04:59:48+05:30 IST