అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం

ABN , First Publish Date - 2021-10-20T02:22:38+05:30 IST

పరిపాలన చేతకాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేసిందని నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్‌ విమర్శించారు.

అసమర్థ ప్రభుత్వంతో రాష్ట్ర భవిష్యత్‌ అంధకారం
నగరిలో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు

  -  టీడీపీ నేత గాలి భాను ప్రకాష్‌


పుత్తూరు, అక్టోబరు 19 : పరిపాలన చేతకాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేసిందని నగరి టీడీపీ ఇన్‌చార్జి గాలి భాను ప్రకాష్‌ విమర్శించారు. మంగళవారం నగరిలో పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొదట నియోజక వర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలతో ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా గాలి భాను మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కొత్త అప్పుల కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లను బిగించే చర్యలను మానుకోవాలని కోరారు. నియోజక వర్గంలో ఆర్ధికంగా బలహీనంగా వున్న మరమగ్గ కార్మికులు అధిక సంఖ్యలో వున్నందున ట్రూఅప్‌ ఛార్జీల పేరిట పెంచిన ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో   తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి మీరా, పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు గంజి మాధవయ్య, దశరధవాసు, అధికార ప్రతినిధులు చినబాబు, ధనంజయులునాయుడు, పార్లమెంటరీ కార్యదర్శి రొక్కంబాలాజీ, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి లక్ష్మీప్రసన్న, నియోజక వర్గంలోని పార్టీ మండల అధ్యక్షులు రమేష్‌, శివకుమార్‌రెడ్డి, జీవరత్నంనాయుడు, రవికుమార్‌, వెంకటయ్య, వెంకటేశ్వరరావు, రమే్‌షరాజు, ప్రధానకార్యదర్శులు శ్రీనివాసన్‌, పురుషోత్తం, ధనపాల్‌, బాలాజీ, హేమావతి,  విజయకుమార్‌, బాబుయాదవ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T02:22:38+05:30 IST