భవిష్యత్తు టీడీపీదే

ABN , First Publish Date - 2022-01-24T06:21:46+05:30 IST

‘వైసీపీ అన్నీ విధాలుగా విఫలమైంది. అన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయి. భవిష్యత్తు టీడీపీదే. సమష్టిగా సాగుదాం.

భవిష్యత్తు టీడీపీదే
అనంత పార్లమెంటు కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు

విజయం కోసం సైనికుల్లా పోరాడుదాం

వైసీపీ అరాచకం, అసమర్థతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. అనంత పార్లమెంటు కమిటీ సమావేశంలో కాలవ  

అనంతపురం వైద్యం, జనవరి 23: ‘వైసీపీ అన్నీ విధాలుగా విఫలమైంది. అన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయి. భవిష్యత్తు టీడీపీదే. సమష్టిగా సాగుదాం. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం’ అని మాజీ మంత్రి, అనంత పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎంవైఆర్‌ కల్యాణమండపంలో ఆదివారం అనంతపురం పార్లమెంటు టీడీపీ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. తొలుత నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు తమ అభిమతాలను పార్లమెంటు అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులుకు తెలియజేశారు. అనంతరం కాలవ మాట్లాడుతూ పార్లమెంటు కమిటీకి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉందన్నారు. పదవులు లేకపోయినా పార్టీ కోసం అందరూ పనిచేస్తూ వస్తున్నారన్నారు. మనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం అని, అందుకే మన శ్రమను గుర్తించి పార్టీలో పదవులు కల్పించి గౌరవించిందన్నారు. మనదీ కుటుంబమే చిన్నచిన్న అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయితే వాటి పరిష్కారానికి  కృషి చేయాలన్నారు. సా ధ్యం కాకపోతే పార్లమెంటు కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు.  అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్దామన్నారు. ప్రతి దానిని సమస్యగా చూడకూడదని పార్టీ ఆశయాలకు అనుగుణంగా సాగాలన్నారు. మన వల్ల పార్టీకి నష్టం జరగకూడదని సూచించారు. ముఖ్యమంత్రి నియంత పాలనతో అన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయన్నారు. అనంతలో వరుసగా పంటలు నష్టపోతున్నా బీ మా, పంట నష్టప రిహారం ఇవ్వలేదన్నారు. డ్రిప్‌, స్ర్పింక్లర్లను పూర్తిగా ఎత్తి వేశారన్నారు. గత ఏడాది జరిగిన పంటనష్టాన్ని అంచనా వేయలేదన్నారు. దశాబ్దాల క్రితం కట్టిన పేదల ఇళ్ల నుంచి ఓటీఎస్‌  పేరుతో దోచుకుంటున్నారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో అన్యాయం చేశారన్నారు. ప్రతీ ఉద్యోగి, పెన్షనర్‌ జగన తీరు పట్ల ఆవేదనతో ఊగిపోతున్నారన్నారు. ఇలాంటి సమయంలో మనం ఎంతో బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన దుర్మార్గాలు, వైసీపీ అరాచకాలు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మన నాయకత్వంపై ఆయా వర్గాలకు నమ్మకం కలిగించాలన్నారు. మనం అధికారంలోకి రాకపోతే మనమే కాదు రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంద న్నారు. అసెంబ్లీలో అరాచకాలను తట్టుకోలేక తాను సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని కౌరవ సభను గౌరవ సభగా మారుస్తానని మన అధినేత చంద్రబాబు శపథం చేశారన్నారు. అధినేత ఆశయం నెరవేర్చేందుకు మన మందరం సైనికుల్లా పోరాటం   సాగించి రాబోయే ఎన్ని కల్లో పసుపు జెండాను విజయపథానా ఎగురవేద్దామని  పిలుపునిచ్చారు. సమావేశంలో అనంతపురం పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌చౌదరి, ఉపాధ్యక్షులు కేశవరెడ్డి, పసుపుల హనుమంతరెడ్డి, మస్తానయాదవ్‌, వైపీ రమేష్‌, నాగల్లి రాజు, రాయంపల్లి నాగరాజు, అధికార ప్రతినిధలు  సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, డేగల కృష్ణమూర్తి, తెలుగుయువత పార్లమెంటు అధ్యక్షుడు జగన్నాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకరయాదవ్‌, రాయల కొండయ్య, గుత్తా ధనుంజయనాయుడు, చింబిలి ప్రసాద్‌నాయుడు, తలారి సత్యప్ప,  బండి కృష్ణమూర్తి, రంగయ్య, పురుషోత్తం, రామరాజు, చిరంజీవులు, నరేంద్రనాయుడు, రాజే్‌షనాయక్‌తో పాటు పలువురు పార్లమెంటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:21:46+05:30 IST