సీఎం జగన్‌ దిగిపోతేనే భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-10-04T05:24:34+05:30 IST

విద్యార్థులు, యువత భవిష్యత్‌ బాగుండాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగిపోవాల్సిందేనని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజ అన్నారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫరాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ఆగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సీఎం జగన్‌ దిగిపోతేనే భవిష్యత్తు
కలెక్టరేట్‌ ఎదుట ఆగ్రహ దీక్ష చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు

 ఆగ్రహ టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు రవితేజ

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 3 : విద్యార్థులు, యువత భవిష్యత్‌ బాగుండాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగిపోవాల్సిందేనని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజ అన్నారు. టీఎన్‌ఎ్‌సఎ్‌ఫరాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ఆగ్రహ దీక్షలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థి, యువత భవిష్యత్‌ అంథకారంలోకి నెట్టిందన్నారు. వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన 77 జీవో కారణంగా పీజీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను పునరుద్ధరించి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్థికి విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలను పూర్తి స్థాయిలో అందించడంతో పాటు పాఠశాలల విలీన ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేయాలన్నారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. విద్యార్థి, నిరుద్యోగులకు మేలు జరగాలంంటే జగన్‌ప్రభుత్వం దిగపోవాల్సిన అవసరం ఉందని రవితేజ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు మంచు లలిత్‌కుమార్‌, ఎర్నేని లింగయ్య, రాష్ట్ర కార్యదర్శి రేగుల శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటస్వామి, సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ షేక్‌ అప్రోజ్‌, కుర్రా అయ్యప్ప, షరీఫ్‌, మామిళ్ల పవన్‌, గోగినేని రాకేష్‌, యశ్వంత్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-10-04T05:24:34+05:30 IST