కేంద్రం కుట్రలను అడ్డుకుంటేనే కార్మికులకు భవిష్యత్‌

ABN , First Publish Date - 2020-11-22T05:40:13+05:30 IST

కేంద్రం లోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తున్న కుట్ర లను అడ్డుకుంటేనే కార్మికులకు భవిష్య త్‌, ఉద్యో గ భద్రత ఉంటుందని జేఏసీ నాయకులు ముత్యంరావు, ఎన్‌.శంకర్‌ (సీఐటీయూ), మక్కాన్‌సింఘ్‌ రాజ్‌ఠా కూర్‌ (ఐఎన్‌టీయూసీ), చిలుక శంకర్‌ (ఐఎఫ్‌టీయూ), సునిల్‌(ఏఐటీయూసీ), సత్యం (హెచ్‌ఎం ఎస్‌), భూమయ్య (టీఆర్‌ఎస్‌) స్పష్టం చేశారు.

కేంద్రం కుట్రలను అడ్డుకుంటేనే కార్మికులకు భవిష్యత్‌
గేట్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న జేఏసీ నాయకుడు ముత్యంరావు

 26న సమ్మెను విజయవంతం చేయాలి

 ఎన్టీపీసీ గేట్‌ మీటింగులో జేఏసీ నేతలు

జ్యోతినగర్‌, నవంబరు 21: కేంద్రం లోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేస్తున్న కుట్ర లను అడ్డుకుంటేనే కార్మికులకు  భవిష్య త్‌, ఉద్యో గ భద్రత ఉంటుందని జేఏసీ నాయకులు ముత్యంరావు, ఎన్‌.శంకర్‌ (సీఐటీయూ), మక్కాన్‌సింఘ్‌ రాజ్‌ఠా కూర్‌ (ఐఎన్‌టీయూసీ), చిలుక శంకర్‌ (ఐఎఫ్‌టీయూ), సునిల్‌(ఏఐటీయూసీ), సత్యం (హెచ్‌ఎం ఎస్‌), భూమయ్య (టీఆర్‌ఎస్‌) స్పష్టం చేశారు. ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సంబం ధించి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ ప్లాంటు 2వ గేట్‌ వద్ద జరిగిన గేట్‌ మీటింగ్‌లో జే ఏసీ నాయకులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. కార్మిక వర్గానికి  దశాబ్దా ల కాలంగా అండగా ఉన్న కార్మిక చట్టాలను సవరించి కొత్త చట్టాలను తీసుకు వచ్చారని, కొత్త చట్టం వల్ల ప్రైవేటు సంస్థలకు మేలు జరుగు తుందని, యూనియన్లు, కార్మికుల హక్కులు పోతాయని ఆయన పేర్కొన్నా రు. కేంద్రం అవలంభిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలకు నిరసనగా ఈనెల 26న జరిపే దేశవ్యాప్త సమ్మెలో పారిశ్రా మిక ప్రాంతం లోని సంఘటిత, అసంఘ టిత కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. గేట్‌ మీటిం గులో జేఏసీ నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి, భూషణం, చందర్‌, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-22T05:40:13+05:30 IST