రెండు, మూడు రోజుల్లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-09-29T06:13:45+05:30 IST

రెండు, మూడు రోజుల్లో నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

రెండు, మూడు రోజుల్లో  100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
సమస్యలు తెలుసుకుంటున్న రాష్ట్ర కమిషనర్‌ అజయ్‌కుమార్‌

 వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ 

 నకిరేకల్‌, సెప్టెంబరు 28: రెండు, మూడు రోజుల్లో నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తెలిపారు. నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగులపట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేషీట్‌లో చికిత్స వివరాలు పొందుపర్చకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆస్పత్రి గదులను, ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాత భవనం గదుల్లో పెచ్చులు రాలుతున్నందున చికిత్సకోసం వచ్చే రోగులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్త లు తీసుకోవాలన్నారు. నకిరేకల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభు త్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయని, ఆస్పత్రి నిర్మాణంకోసం మ్యా ప్‌ తయారయిందని రెండు, మూడు రోజుల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణంకోసం శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్‌ టి. వినయ్‌ కృష్ణారెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వైద్య సిబ్బంది కం టె ఎక్కువగా స్టాప్‌ ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆయన వెంట డీసీహెచ్‌ మాతృనాయక్‌, నకిరేకల్‌ ఆసుపత్రి సూపరిండెంట్‌ శ్రీనాధ్‌నాయుడు, వైద్య సిబ్బంది ఉన్నారు. 


కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌కు వినతి

నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీచేసిన వైద్య విధాన పరిషత్‌ రాష్ట్ర కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు కాంగ్రెస్‌ ఆఽధ్వర్యంలో పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, మునిసిపల్‌ కౌన్సిలర్‌ గాజుల సుకన్య శ్రీనివాస్‌ నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రి కి నిత్యం 5, 6 మండలాలనుంచి వస్తున్న రోగులకు మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తిచేశారు. నకిరేకల్‌కు సమీపంలోకి హైవే ఉన్నందున ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్‌, డయాలసిస్‌ సెంటర్‌, మొబైల్‌ ఎక్స్‌రేను ఏర్పాటు చేసి వినియోగంలోకి తేవాలని కోరారు.  

Updated Date - 2022-09-29T06:13:45+05:30 IST