పిల్లలు పుట్టాక పెళ్లి కానుక ఇస్తారా..: అయ్యన్న

ABN , First Publish Date - 2022-05-15T08:25:46+05:30 IST

పెళ్లి కానుక పథకం ఏమైందో చెప్పాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

పిల్లలు పుట్టాక పెళ్లి కానుక ఇస్తారా..: అయ్యన్న

నర్సీపట్నం, మే 14: పెళ్లి కానుక పథకం ఏమైందో చెప్పాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.  ‘‘పెళ్లి కానుక డబ్బులు చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తానని ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 65 వేల మంది ఇందుకోసం దరఖాస్తుల చేసుకొని ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారు? ఇది వారిని మోసం చేయడం కాదా? వివాహ స మయంలో ఇచ్చే కానుకను...పిల్లలు పుట్టిన తర్వాతఇస్తారా?’’ అని నిలదీశారు. 

Updated Date - 2022-05-15T08:25:46+05:30 IST