టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాలకు పూర్వ వైభవం

ABN , First Publish Date - 2022-05-23T04:37:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆలయాలకు పూర్వ వైభవం
వర్గల్‌లో విలేకరులతో మాట్లాడుతున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి 

వర్గల్‌, మే 22: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పురాతన ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రం తరహాలో నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేయగా, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పురాతన క్షేత్రాల జీర్ణోద్ధరణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాలను అభివృద్ధి చేశారన్నారు. అందులో వర్గల్‌ వేణుగోపాలస్వామి ఆలయం ఒకటన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వేణుగోపాలస్వామి ఆలయానికి మరమ్మతులు చేయడంతో పూర్వ వైభవం వచ్చిందన్నారు. వర్గల్‌ వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ టేకులపల్లి రాంరెడ్డి, జడ్పీటీసీ బాలుయాదవ్‌ ఎంపీపీ లతారమేష్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. 

భక్తిభావాన్ని అలవర్చుకోవాలి : ఎంపీ

దౌల్తాబాద్‌, మే 22: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకున్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని మెదక్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో ఏర్పాటుచేసిన పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన, దుర్గామాత ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం పక్కనే ఉన్న ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఏపీఎం కిషన్‌కు ఫోన్‌చేసి ధాన్యం నిల్వ ఉంచకుండా లారీలు తెప్పించి పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రణం శ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు రహీమోద్దీన్‌, ఉపసర్పంచ్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T04:37:13+05:30 IST