Abn logo
Sep 22 2021 @ 00:33AM

ప్రకృతి వనాల అభివృద్ధిపై దృష్టి సారించాలి

బృహత్‌ పల్లె ప్రకృతిని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ రవి

కలెక్టర్‌ రవి

కోరుట్ల రూరల్‌,  సెప్టెంబరు 21: ప్రతి మండలంలో 10 ఎకరాలలో చే పట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వానాల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతి నిధులు దృష్టి సారించాలని కలెక్టర్‌ రవి అన్నారు. మంగళవారం మండ లంలోని అయిలాపూర్‌ గ్రామంలో నిర్మాణం చేస్తున్న బృహత్‌ ప్రకృతి వ నం పరిశీన జరిపి అధికారులకు పలు సూచనలు సలహాలను అందిం చారు. వనాలలో వివిధ రకాల మొక్కలను నాటాలన్నారు. లక్ష్యం ప్రకారం మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అరుణ శ్రీ, ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్‌  రాధ-సందయ్యలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.