రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABN , First Publish Date - 2022-01-27T05:46:46+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 73వ గ ణతంత్ర వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ వద్ద జెండావిష్కరణ చేస్తున్న కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌

- నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- హాజరైన ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి 

నాగర్‌కర్నూల్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 73వ గ ణతంత్ర వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. కరోనా మూడో వేవ్‌ ప్రభావం వేడుకలపై పడింది. తక్కువ మంది అధికారులు, అతిథులతో  వే డుకలను నిర్వహించారు. కలెక్టరేట్‌ దగ్గర నిర్వహించిన గణతంత్ర దినోత్స వ వేడుకల్లో 10గంటలకు కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జాతీయ జెండాను ఆవి ష్క రించారు. కలెక్టర్‌ ప్రసంగం లేకుండానే జెండా ఆవిష్కరించే కార్యక్రమం వర కే పరిమితం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ మనోహర్‌, అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, వివిధ శాఖల సిబ్బంది పాల్గొ న్నారు. అలాగే   జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద జడ్పీ సీఈవో ఉషా జాతీయ పతాకావిష్కణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా మన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, జడ్పీటీసీ సభ్యు డు శ్రీశైలం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పురపాలిక సంఘం, గాం ధీపార్కులో వద్ద మునిసిపల్‌ కమిషనర్‌ గోనె అన్వేష్‌ జాతీయ పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-27T05:46:46+05:30 IST