జియోలోకి పెట్టుబడుల వరద

ABN , First Publish Date - 2020-06-06T06:51:22+05:30 IST

ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ర్టీసకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా అబుదాబీకి చెందిన ముబదలా ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీకి

జియోలోకి పెట్టుబడుల వరద

  • ముబదలా ఇన్వె‌స్టమెంట్‌కి 1.85 శాతం వాటా విక్రయం
  • డీల్‌ విలువ రూ.9,093 కోట్లు 
  • సిల్వర్‌లేక్‌కు మరింత వాటా 
  • అదనంగా రూ.4,561 కోట్ల పెట్టుబడి 

 ముంబై: ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ర్టీసకి చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. తాజాగా అబుదాబీకి చెందిన ముబదలా ఇన్వె్‌స్టమెంట్‌ కంపెనీకి జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.85 శాతం వాటాలు విక్రయించింది. డీల్‌ విలువ రూ.9093.60 కోట్లు. గత కొద్ది వారాల వ్యవధిలో రిలయన్స్‌ కుదుర్చుకున్న ఆరో డీల్‌ ఇది. మొత్తం 6 డీల్స్‌లో కలిపి కంపెనీకి రూ.87,655.35 కోట్ల నిధులు సమకూరాయి. ఈ డీల్‌తో జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 కోట్లకు పెరిగింది. కాగా జియోలో ఇప్పటికే 1.15 శాతం వాటాను చేజిక్కించుకున్న సిల్వర్‌లేక్‌ వాటాను మరింత పెంచుకుంది. తాజాగా మరో 4,546.80 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటాను 2.08 శాతానికి పెంచుకుంది.


దీంతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో సిల్వర్‌లేక్‌ పెట్టుబడులు రూ.10,202.55 కోట్లకు చేరుకున్నాయి. దీంతో ఆర్‌ఐఎల్‌ సమీకరించిన నిధుల మొత్తం రూ.92,202.15 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా జియో ప్లాట్‌ఫామ్స్‌ లో 20 శాతం వాటాలను విక్రయించాలన్న రిలయన్స్‌ లక్ష్యం కూడా నెరవేరింది. వృద్ధి అవకాశాలు గల కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నది తమ ధ్యేయమని, డిజిటల్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలో సరికొత్త విప్లవం తీసుకువచ్చిన జియో ప్లాట్‌ఫామ్స్‌... డిజిటల్‌ ఎకానమీ మరింతగా అభివృద్ధి చెందడానికి దోహదపడగలదని తాము ఆశిస్తున్నామని ముబదలా కంపెనీ సీఈఓ ఖల్దూన్‌ అల్‌ ముబారక్‌ అన్నారు. 


అబుదాబీతో తనకు గల దీర్ఘకాలిక అనుబంధంలో భిన్న రంగాల్లో ముబదలా కార్యకలాపాలను గమనించానని, ఆ కంపెనీకి గల అనుభవంతో తాము మరింత ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నామని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. ’

Updated Date - 2020-06-06T06:51:22+05:30 IST