fishing: చేపల కోసం వల వేస్తే.. ఇది పడిందేంటీ.. భయంతో పరుగులు తీసిన మత్స్యకారులు.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-08-24T21:17:45+05:30 IST

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయంలో అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో..

fishing: చేపల కోసం వల వేస్తే.. ఇది పడిందేంటీ.. భయంతో పరుగులు తీసిన మత్స్యకారులు.. చివరకు ఏమైందంటే..

కొన్నిసార్లు ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి సమయంలో అవాక్కవడం మన వంతవుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. బీహార్‌లో అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారులు.. చివరకు షాక్ అయ్యారు. వల పైకి లాగి భయంతో పరుగులు తీశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


బీహార్ (Bihar) రాష్ట్రం కువాన్వాన్ గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని నదిలో చేపలు పట్టేందుకు మత్స్యకారులు ( Fishermen) రోజూ లాగే వల వేశారు. అయితే కాసేపటికి వల చాలా బరువుగా అనిపించింది. దీంతో వలను పైకి లాగిన మత్స్యకారులు.. అందులో చేపలకు బదులుగా 20కేజీల కొండచిలువ ఉండడం చూసి షాక్ అయ్యారు. వలను అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరుగందుకున్నారు. ఈ విషయం తెలిసి స్థానికులంతా అక్కడ గుమికూడారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది (Forest Department staff).. స్నేక్ క్యాచర్‌తో సహా అక్కడికి చేరుకున్నారు. కొండచిలువను వల నుంచి బయటికి తీసి, నైనిజోర్ ప్రాంతంలోని కోయిల్వార్ కట్ట సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. కొండచిలువ విషపూరితం కాకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదామూ జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఆవేశంగా చెట్టెక్కిన సింహం.. పాపం దిగేటప్పుడు ఇలా అవుతుందని దానికేం తెలుసు..



Updated Date - 2022-08-24T21:17:45+05:30 IST