ఈ చేప డైనోసార్‌ కాలం నాటిది!

ABN , First Publish Date - 2021-06-20T09:41:16+05:30 IST

దాదాపు 40 కోట్ల ఏళ్ల క్రితం.. అంటే డైనోసార్ల కాలం నుంచి కొనసాగుతున్న చేప జాతి అది. ఆ జాతి చేపలు ఏకంగా వందేళ్ల పాటు జీవిస్తాయి. ఐదేళ్ల పాటు గర్భాన్ని మోస్తాయి. ఆ జాతి పేరే

ఈ చేప డైనోసార్‌ కాలం నాటిది!

పారిస్‌, జూన్‌ 19: దాదాపు 40 కోట్ల ఏళ్ల క్రితం.. అంటే డైనోసార్ల కాలం నుంచి కొనసాగుతున్న చేప జాతి అది. ఆ జాతి చేపలు ఏకంగా వందేళ్ల పాటు జీవిస్తాయి. ఐదేళ్ల పాటు గర్భాన్ని మోస్తాయి. ఆ జాతి పేరే కొయెలాకాంత్‌. పరిశోధకులు వీటికి జీవించే శిలాజాలుగా పేరు పెట్టారంటే.. ఇవెంత పురాతనమైనవో అర్థం చేసుకోవచ్చు. మనిషి అంత ఆకారానికి పెరిగే కొయెలాకాంత్‌ల్లో కదలిక మాత్రం చాలా నెమ్మదిగా ఉంటుంది. సముద్రాలకు అట్టడుగున సూర్యరశ్మి ఏమాత్రం రాని చోట్ల ఇవి జీవిస్తుంటాయి. అయితే.. ప్రస్తుతం పూర్తిగా అంతరించేపోయేందుకు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఎంతలా అంటే.. ఈ జాతిలో చనిపోయిన చేపలపై మాత్రమే ఫ్రెంచి పరిశోధకులు అధ్యయనం చేయగలిగారు.


తమ అధ్యయన వివరాలను కరెంట్‌ బయాలజీ అనే జర్నల్‌లో వారు ప్రచురించారు. దాని ప్రకారం.. కొయెలాకాంత్‌ చేపల్లో 50ఏళ్లు గడిచే వరకూ ఆడ చేపలు యవ్వన దశకు రావు. మగ చేపలు 40 నుంచి 69ఏళ్ల వయసులో యవ్వనానికి వస్తాయి. ఇవి తొలుత అంతరించిపోయాయని అందరూ భావించారు. కానీ.. 1938లో ఈ చేపల్ని దక్షిణాఫ్రికా సమీపంలో గుర్తించారు.  

Updated Date - 2021-06-20T09:41:16+05:30 IST