Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇండియా-ఎ 125/1

  • దక్షిణాప్రికా-ఎ 509/7 డిక్లేర్డ్‌
  • తొలి అనధికారిక టెస్ట్‌


బ్లూమ్‌ఫోంటేన్‌: దక్షిణాఫ్రికా-ఎతో తొలి అనధికారిక టెస్ట్‌లో భారత్‌-ఎ దీటుగా బదులిస్తోంది. ఓపెనర్లు పృథ్వీ షా (48), కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (45 బ్యాటింగ్‌) రాణించడంతో.. భారత్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 125 పరుగులతో ఆడుతోంది. బుధవారం ఆట ముగిసే సమయానికి పాంచల్‌తోపాటు అభిమన్యు ఈశ్వరన్‌ (27) క్రీజులో ఉన్నాడు. పృథ్వీని సిపామ్లా క్యాచవుట్‌ చేశాడు.


అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 343/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా-ఎ 509/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి సెషన్‌లోనే ఓవర్‌నైట్‌ బ్యాటర్లు స్మిత్‌ (52), పీటర్‌ మలన్‌ (163)ను భారత బౌలర్లు అవుట్‌ చేశారు. కానీ, సైన్‌తెంబా (82 నాటౌట్‌), జార్ట్‌ లిండే (51) అర్ధ శతకాలతో టీమ్‌ స్కోరును ఐదు వందల మార్క్‌ దాటించారు. సైనీ, నాగ్‌వ్‌సవల్లా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

Advertisement
Advertisement