ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్‌

ABN , First Publish Date - 2021-06-22T09:50:31+05:30 IST

ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా న్యూజిలాండ్‌ వెయిట్‌లిఫ్టర్‌ లారెల్‌ హుబ్బార్డ్‌ రికార్డులకెక్కనుంది.

ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్‌

వెల్లింగ్టన్‌: ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా న్యూజిలాండ్‌ వెయిట్‌లిఫ్టర్‌ లారెల్‌ హుబ్బార్డ్‌ రికార్డులకెక్కనుంది. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 87 కిలోల కేటగిరిలో 43 ఏళ్ల హుబ్బార్డ్‌ను టోక్యో ఒలింపిక్స్‌కు ఎంపిక చేసినట్టు న్యూజిలాండ్‌ ఒలింపిక్‌ కమిటీ తెలిపింది. 2013లో మహిళగా మారకముందు పురుషుడిగా హుబ్బార్డ్‌ అనేక టోర్నీలో పాల్గొంది. ట్రాన్స్‌జెండర్లు కూడా మహిళల విభాగంలో పాల్గొన వచ్చని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 2015లోనే నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, వీరికి మహిళల విభాగంలో అవకాశం కల్పించడంపై కొంత వివాదం రేగుతోంది.

Updated Date - 2021-06-22T09:50:31+05:30 IST