తొలి పరీక్ష ప్రశాంతం

ABN , First Publish Date - 2022-05-23T05:30:00+05:30 IST

తొలి పరీక్ష ప్రశాంతం

తొలి పరీక్ష ప్రశాంతం
వికారాబాద్‌లోని పరీక్షా కేంద్రంలో విద్యార్థుల క్యూ


  • పదో తరగతి ప్రథమ భాష పరీక్షకు వికారాబాద్‌ జిల్లాలో 226 మంది గైర్హాజరు 
  • పలు కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర వయోజన విద్య అదనపు డైరెక్టర్‌ విజయలక్ష్మి బాయి

వికారాబాద్‌/మేడ్చల్‌, మే23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పదోతరగతి తొలి పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. వికారాబాద్‌ జిల్లాలో ప్రథమ భాష పరీక్ష 14,440 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, వారిలో 14,214 మంది హాజరు కాగా, 226 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌ పరీక్షా కేంద్రాల్లో ఏడుగురు విద్యార్థులకు నలుగురు హాజరు కాగా, ముగ్గురు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభం కావడానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్న విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు చాలా వరకు చేరుకున్నారు.  క్యూలో వచ్చిన విద్యార్థులను కేంద్రాల నిర్వాహకులు తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. కరోనా ఉధృతి తగ్గిన తరువాత రెండేళ్ల తరువాత తొలిసారిగా పదో తరగతి పరీక్ష నిర్వహిస్తుండడంతో నిర్వాహకులు టెన్షన్‌కు గురయ్యారు. కాగా, పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో విద్యాశాఖ అధికారులు హమ్మయ్మ అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన జిల్లా పరిశీలకురాలు 

రాష్ట్ర వయోజన విద్య అదనపు డైరెక్టర్‌, జిల్లా పరిశీకురాలు విజయలక్ష్మీబాయి డీఈవో రేణుకాదేవితో కలిసి సోమవారం వికారాబాద్‌ బాలుర, బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలు, ధారూరు మండలం, కెరెల్లి జడ్పీహెచ్‌ఎస్‌, అనంతగిరిపల్లి టీఎ్‌సడబ్ల్యుఆర్‌ఎ్‌సలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు, 

మేడ్చల్‌ జిల్లాలో 99.41 శాతం హాజరు 

మేడ్చల్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని సోమవారం ఓ ప్రకటనలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు.   మొదటి రోజు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 99.41 శాతంగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లాలో 43,288 మంది విద్యార్థులకు 43,032 మంది విద్యార్థులు హాజరయ్యారని, 251 పరీక్షా కేంద్రాల్లో 60 కేంద్రాలను ప్లయింగ్‌ స్వ్కాడ్‌ తనిఖీలు చేశారని  పేర్కొన్నారు.  అన్ని పరీక్షా కేంద్రాలల్లో సీసీ కెమోరాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్ల కలెక్టర్‌ సంతృప్తి చేశారు.

Updated Date - 2022-05-23T05:30:00+05:30 IST