Apr 11 2021 @ 00:39AM

భవ్య ఇచ్చిన మొదటి తీపి జ్ఞాపకం

కథానాయిక మెహరీన్‌ త్వరలో పెళ్లికూతురు కానుంది. మార్చి 13న భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఇంకా పెళ్లి తేది ఖరారు చేయలేదు. భవ్య తనకు ఎలా ప్రపోజ్‌ చేశారో ఓ వీడియో రూపంలో అభిమానులతో షేర్‌ చేసుకున్నారు మెహరీన్‌. ‘‘ఫిబ్రవరిలో మేమిద్దరం అండమాన్‌ వెళ్లాం. అక్కడ స్కూబా డైవింగ్‌ చేస్తుండగా ఓ రింగ్‌ తొడిగి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని ప్రపోజ్‌ చేశాడు. నీళ్లల్లో మోకాలి మీద కూర్చుని అలా అడిగితే భలే ముచ్చటేసింది. ఇలా తన ప్రేమను వ్యక్తం చేస్తాడని నేను ఊహించలేదు. భవ్య నుంచి నేను అందుకున్న మొదటి  తీపి జ్ఞాపకమది’’ అని తెలిపారు. ప్రస్తుతం మెహరీన్‌ ‘ఎఫ్‌3’ చిత్రంలో నటిస్తున్నారు.