Abn logo
Jul 15 2020 @ 23:35PM

ఓటీటీలో తొలి అడుగు

తమిళ నటుడు శరత్‌కుమార్‌  ఓటీటీలోకి వస్తున్నారు. అర్చనా శరత్‌ రాసిన నవల ‘బర్డ్స్‌ ఆఫ్‌ ప్రే - ద హంట్‌ బిగిన్స్‌’ను ఆయన ఓటీటీ తెర మీదకు తీసుకొస్తున్నారు. మంగళవారం శరత్‌ కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా... తన భర్తను ఓటీటీ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ‘బర్డ్స్‌ ఆఫ్‌ ప్రే’ ఫస్ట్‌ లుక్‌ను రాధిక విడుదల చేశారు. దీన్ని రాడాన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై ఆమె నిర్మిస్తున్నారట. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగులోనూ విడుదల కానుంది.

Advertisement
Advertisement
Advertisement