మణిపూర్‌లో తొలిసారి కాషాయ జెండా

ABN , First Publish Date - 2022-03-11T07:28:45+05:30 IST

మణిపూర్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. తాజా అసెంబ్లీ

మణిపూర్‌లో తొలిసారి కాషాయ జెండా

  • 32 సీట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటిన బీజేపీ
  • పదేళ్ల కిందటి వరకు ఒక్కసీటూ లేని వైనం


ఇంఫాల్‌, మార్చి 10: మణిపూర్‌లో కాషాయ జెండా రెపరెపలాడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీని సాధించింది. మొత్తం 60 సీట్లున్న మణిపూర్‌ అసెంబ్లీలో... బీజేపీ 32 సీట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌ను అధిగమిం చింది. స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 28 సీట్లతో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌... ఈసారి 5 స్థానాలను మాత్రమే దక్కిం చుకుంది. 2017లో ఇతర పార్టీల మద్దతుతోపాటు కాం గ్రెస్‌ను చీల్చడం ద్వారా అధికారం చేపట్టిన బీజేపీ... ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవు తోంది. సంకీర్ణ సమస్యలు, పార్టీ ఫిరాయింపుల వివాదాలను ఎదుర్కొంటూనే... ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ అమలుచేసిన అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ గెలుపులో కీలకపాత్ర పోషిం చాయి.


బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి మౌలిక వసతులను అభివృద్ధి చేయడం కూడా ఆ పార్టీ విజయానికి దోహదం చేసి ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచీ ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగలమనే ధీమాను బీజేపీ ప్రదర్శించింది. అభివృద్ధినే ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధంగా ఉపయోగించింది. బహుముఖ పోటీ కూడా బీజేపీకి కొంత కలిసొచ్చింది.


తాజా ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే మొత్తం 60 స్థానాల్లో బరిలోకి దిగింది. వామపక్షాలు, మరికొన్ని స్థానిక పార్టీలతో ఎన్నికలకు ముందే కూటమిని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌.... ఎక్కడా బీజేపీకి గట్టి పోటీని ఇవ్వలేకపోయింది. గత సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వా ములైన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ), నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌(ఎన్‌పీఎఫ్‌) కూడా వేర్వేరుగానే పోటీచేశాయి. దీంతో దాదాపు అన్ని స్థానాల్లో బహుముఖ పోటీ ఏర్పడింది. కాగా... తదుపరి సీఎం ఎవరనేది పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని బీజేపీ మణిపూర్‌ చీఫ్‌ శారదా దేవి అన్నారు.




రాష్ట్ర చరిత్రలో రెండోసారి పూర్తి మెజారిటీ

మణిపూర్‌కు 1972లో రాష్ట్ర హోదా లభించింది. గడచిన 50 ఏళ్లలో మొత్తం 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలే రాష్ట్రాన్ని ఎక్కువకాలం పాలించాయి. 2012లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ 42 సీట్లతో పూర్తి మెజారిటీని సాధించింది. ఆ తర్వాత ప్రస్తుత ఎన్నికల్లోనే బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఇబోబి సింగ్‌ నేతృత్వంలో 2002 నుంచి 2017 వరకు 15 ఏళ్లపాటు నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలించింది.


2007, 2012 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ 2017 ఎన్నికల్లో ఏకంగా 21 స్థానాల్లో గెలిచి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ ఎన్నికల్లో 28 సీట్లతో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించినా... ప్రభుత్వాన్ని ఏర్పా టుచేయడంలో విఫలమైంది. కాంగ్రెస్‌ కంటే తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ను చీల్చడం ద్వారా మరిందరి మద్దతును సాధించి ఐదేళ్ల పాలనను పూర్తి చేసింది. తాజా ఎన్నిక ల్లో బీజేపీకి గతం కంటే 2 ు ఓట్లు ఎక్కువగా వచ్చాయి.


Updated Date - 2022-03-11T07:28:45+05:30 IST