మొదటి ఎలక్ట్రికల్‌ బస్సులు తిరుపతి టూ తిరుమల

ABN , First Publish Date - 2021-07-27T08:40:11+05:30 IST

కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ బస్సులను నడిపేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానించామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

మొదటి ఎలక్ట్రికల్‌ బస్సులు తిరుపతి టూ తిరుమల

కేంద్రం అనుమతించగానే సర్వీసులు 

టెండర్లు ఖరారు: ఆర్టీసీ ఎండీ 


తిరుమల, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కాలుష్య నియంత్రణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ బస్సులను నడిపేందుకు ఇటీవల టెండర్లను ఆహ్వానించామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రస్తుతానికి తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపేందుకు టెండర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. ఆర్టీసీ నుంచి మొట్టమొదటిగా ఎలక్ట్రికల్‌ బస్సులు తిరుమలకు రాబోతున్నాయన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే త్వరలో సర్వీసులు మొదలవుతాయని తెలిపారు. సోమవారం తిరుమల బస్టాండులో ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అతిపెద్ద భవనం ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన తిరుపతిలో పర్యటించారు. 

Updated Date - 2021-07-27T08:40:11+05:30 IST