ఈకా నుంచి తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ ఈ9

ABN , First Publish Date - 2022-04-03T10:31:31+05:30 IST

కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ దారు ఈకా... దేశీ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ ఈ9ను విడుదల చేసింది. శనివారం నాడిక్కడ పుణె ఆల్టర్నేటివ్‌ ఫ్యూయల్‌ కాంక్లేవ్‌లో మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఈ బస్సును విడుదల చేశారు.

ఈకా నుంచి తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ ఈ9


ముంబై: కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ దారు ఈకా... దేశీ మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్‌ బస్‌ ఈ9ను విడుదల చేసింది. శనివారం నాడిక్కడ పుణె ఆల్టర్నేటివ్‌ ఫ్యూయల్‌  కాంక్లేవ్‌లో మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే ఈ బస్సును విడుదల చేశారు. 200 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్‌ మోటార్‌తో రూపొందించి ఈ9 బస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేసినట్లు పినాకిల్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ అయిన ఈకా వెల్లడించింది. ప్రజా రవాణా కోసం 31 సీట్లతో కూడిన ఈ ఎలక్ట్రిక్‌ బస్‌ చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొంది.  


Updated Date - 2022-04-03T10:31:31+05:30 IST