తొలిరోజు అంతంతే

ABN , First Publish Date - 2021-02-25T04:53:40+05:30 IST

కరోనా నేపథ్యంలో 11 నెలలుగా మూసిఉన్న పాఠశాలలను విడతల వారీగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ వి ద్యార్థుల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచిగానీ ఆశించిన మేర ఆసక్తి కనబడడంలేదు.

తొలిరోజు అంతంతే
తనిఖీలు నిర్వహిస్తున్న డీఈవో

6,7,8 తరగతుల ప్రారంభంపై ఆసక్తిచూపని విద్యార్థులు

నిజామాబాద్‌అర్బన్‌, ఫిబ్రవరి 24 : కరోనా నేప: కరోనా నేపథ్యంలో 11 నెలలుగా మూసిఉన్న పాఠశాలలను విడతల వారీగా ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ వి ద్యార్థుల నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచిగానీ ఆశించిన మేర ఆసక్తి కనబడడంలేదు. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం తాజా గా 6,7,8 తరగతుల ప్రారంభానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్చి 1వ తేదీలోగా ఎప్పుడైనా 6,7,8 తరగతులను ప్రా రంభించుకోవచ్చని మంగళవారం విద్యాశాఖ మంత్రి సబి తా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇవ్వగా బుధవారం పాఠశాలల్లో విద్యార్థుల సందడి కనిపించలేదు. అంతంతమాత్రంగానే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. ఇంకా కరోనా భ యం పోకపోవడంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తిని కనబర్చలేదు. జిల్లాలో ప్రభు త్వ పాఠశాలలు 252 ఉన్నత పాఠశాలలు, 118 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా ఇందులో మొత్తం 6,7,8 తరగతులకు సంబంధించిన విద్యార్థులు 12,166 మంది ఉండగా తొలిరోజు కేవలం 762 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. మోడల్‌ స్కూళ్లు 10 ఉండగా ఇందులో 6,7,8 తరగతులు చదువుతున్న విద్యార్థులు 1500 మంది ఉండ గా 110 మంది హాజరయ్యారు. కేజీబీవీ పాఠశాలలు 25 ఉండగా 6,7 తరగతులకు సంబంధించిన విద్యార్థులు 1171 మంది విద్యార్థులకుగాను 68 మంది హాజరయ్యారు. తెలంగాణ రెసిడెన్షియల్‌కు సంబంధించి 3 పాఠశాలలు ఉండగా 212 మంది విద్యార్థులకుగాను ఇప్పటి వరకు ఎవ రూ హాజరుకాకపోగా 95శాతం మంది విద్యార్థులు హాజరవుతామని లేఖలు ఇచ్చినట్లు సమాచారం. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి జిల్లాలో 194 పాఠశాలలు ఉండగా 6,7,8 తరగతులకు సంబంధించి 4773 మంది విద్యార్థులు ఉండగా తొలిరోజు 45 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వం పాఠశాలల ప్రారంభానికి అనుమతులు ఇవ్వడంతో పూర్తిస్థాయిలో విద్యార్థులకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆశించిన మేర హాజరుకాలేదు. 

తరగతి గదులతో ఇబ్బందులు...

ప్రభుత్వం 6,7,8 తరగతుల ప్రారంభానికి అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చోబెట్టడం ఇబ్బందికరంగా మారనుంది. 9,10 తరగతులకు సెక్షన్‌లు పెంచి తరగతి గదికి కేవలం 20 మందినే కూ ర్చునేలా ఏర్పాట్లు చేయగా ఇప్పుడు 6,7,8 తరగతులను ప్రారంభించడం ప్రభుత్వ పాఠశాలల్లో కష్టంగా మారింది. సరిపడినన్ని తరగతి గదులు లేకపోవడం విద్యర్థులను దూరం దూరంగా కూర్చుండబెట్టాలనే నిబంధనలు ఉండ డంతో తరగతి గదులు సరిపోవని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. షిఫ్ట్‌ల వారీగా తరగతులు నిర్వహించడంపైన ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో పాఠశాలల ప్రారంభంపై విద్యార్థులకు సమాచారం అందించడంలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

నగరంలో తనిఖిలు నిర్వహించిన డీఈవో ...

నగరంలోని జీహెచ్‌ఎస్‌ కసాబ్‌గల్లి పాఠశాలతో పాటు జడ్పీహెచ్‌ఎస్‌ అర్సపల్లి పాఠశాలలను బుధవారం డీఈవో దుర్గాప్రసాద్‌ తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుపట్టికతో పాటు శానిటైజేషన్‌, బాత్రూంలు, మధ్యా హ్న భోజనం తదితర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-02-25T04:53:40+05:30 IST