తొలిరోజు ప్రశాంతం

ABN , First Publish Date - 2022-05-24T05:23:39+05:30 IST

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి.

తొలిరోజు ప్రశాంతం
సంగారెడ్డిలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు

 సంగారెడ్డిరూరల్‌/మెదక్‌అర్బన్‌,మే23: సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కరోనా ప్రభావంతో రెండేళ్ల తర్వాత నిర్వహించిన టెన్త్‌ ఎగ్జామ్స్‌ తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. సంగారెడ్డి జిల్లాలో మొదటిరోజు 22,555 మంది విద్యార్థులకు 22,346 మంది విద్యార్థులు హాజరయ్యారు. కలెక్టర్‌ హన్మంతరావు తన తనయుడు సాయి ప్రణవ్‌ బాలాజీని పట్టణంలోని ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద తీసుకెళ్లి బెస్ట్‌ఆ్‌ఫలక్‌ చెప్పి లోనికి పంపించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.. పరీక్ష రాసేందుకు వచ్చిన దివ్యాంగ విద్యార్థి వద్దకు వెళ్లి ఆత్మస్తైర్యంతో పరీక్ష రాయాలని అప్పుడే విజయం వరిస్తుందని భరోసా కల్పించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి సంగారెడ్డిలోని కరుణ హైస్కూల్‌లోని ఏ, బీ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, కొండాపూర్‌ మండలంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని, ఫ్లెయింగ్‌ స్వ్వాడ్‌ 34 కేంద్రాలను, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్‌ సంగారెడ్డి, నందికంది, సదాశివపేట ప్రాంతాల్లోని 10 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా  73 కేంద్రాల్లో జరిగిన తొలిరోజు పరీక్షకు 11,393 మంది విద్యార్థులకు 11,261మంది హాజరయ్యారు. నర్సాపూర్‌లో 5 సెంటర్లను జిల్లా స్ధాయి అధికారులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అల్లాదుర్గం, రేగోడ్‌, రామాయంపేట, నిజాంపేట, కొల్చారంలో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు 18 కేంద్రాలను సందర్శించాయి. పాపన్నపేట, మెదక్‌లోని 4 కేంద్రాలను డీఈవో సందర్శించారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు. తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తూప్రాన్‌ మండలం దాతర్‌పల్లిలోని గురుకుల పాఠశాల నుంచి ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో ఓ డీసీఎం లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.  చిల్‌పచెడ్‌ మండల పరిధిలోని చిట్కుల్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు, కస్తూర్బా విద్యార్థినులు కొల్చారం మండలంలోని రంగంపేట ఎగ్జామ్‌ సెంటర్‌కు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. టేక్మాల్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మెదక్‌ డీఈవో రమేశ్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌కు చెందిన సంపత్‌కుమార్‌కు రెండు రోజుల క్రితం అపెండిక్స్‌ ఆపరేషన్‌ అయ్యింది. సోమవారమే పరీక్షలు ప్రారంభమవ్వడంతో ఇంట్లో తల్లిదండ్రులు రెస్ట్‌ తీసుకోవాలని చెప్పినప్పటికీ సదరు విద్యార్థి పరీక్ష హాజరయ్యాడు. రేగోడులో పరీక్ష కేంద్రాన్ని ఫ్లెయింగ్‌ స్క్వాడ్‌ ఆదర్మ్‌కుమార్‌, తహసీల్దార్‌ సర్దార్‌ హర్దీ్‌పసింగ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ తనిఖీలు చేశారు. ఎస్‌ఐ సత్యనారాయణ పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలోని ఎంఈవోలు, తహసీల్దార్లు, అధికారులు ఎగ్జామ్‌ సెంటర్లను తనిఖీలు చేశారు. 





Updated Date - 2022-05-24T05:23:39+05:30 IST