మత్స్య సంపదపై మొదటి హక్కుదారులు గంగాపుత్రులే : ఎల్లయ్య

ABN , First Publish Date - 2021-01-17T05:21:17+05:30 IST

మత్స్య సంపదపై మొట్టమొదటి హక్కుదారులు గంగపుత్రులేనని పట్టణ గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు కాచాపురం ఎల్లయ్య అన్నారు.

మత్స్య సంపదపై మొదటి హక్కుదారులు గంగాపుత్రులే : ఎల్లయ్య
మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న గంగాపుత్రులు

కామారెడ్డి, జనవరి 16: మత్స్య సంపదపై మొట్టమొదటి హక్కుదారులు గంగపుత్రులేనని పట్టణ గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు కాచాపురం ఎల్లయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య సంపదపై గంగాపుత్రులకు ఉన్న హక్కులను హరించే విధం గా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముదిరాజ్‌లకు హక్కు ఉన్నట్లుగా ప్రకటించడం సిగ్గు చేటన్నారు. శాసన సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత్స్యకారులను తన కడుపులో పెట్టు కుని మా దయనీయ జీవితాలను దుర్భర పరిస్థితులను గమని ంచి మత్స్య సంపదపై మొట్టమొదటి హక్కుదారులు గంగాపు త్రులేనని ప్రకటించారని అన్నారు. కొందరు ఈ ప్రకటనను జీర్ణించుకోలేక పక్కదారి పట్టిస్తూ ఇష్టం వచ్చిన ప్రకటనలు చేయిస్తున్నారన్నారు. కులాల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నా రని అన్నారు. ఈ నెల 10న మత్స్యశాఖ మంత్రి తలసాని చేసి న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని గంగాపుత్ర సంఘం ప్రతినిధులు పాక వెంకటి, నారాయణ, పాక రవిప్రసాద్‌, రాము, పాక నారాయణలు పేర్కొన్నారు.
గంగాపుత్రులకే చెరువులపై హక్కు ఉండాలి
రామారెడ్డి: చెరువుల్లో చేపలు పట్టే హక్కు గంగాపుత్రులకే ఉండాలని మధ్యలో ముదిరాజులకు ఇస్తామంటే ఒప్పుకోమని డిమాండ్‌చేస్తూ పెద్దఎత్తున రామారెడ్డి మండల కేంద్రంలో గంగాపుత్రులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాపుత్రులు మాట్లాడుతూ చెరువులలో చేపలు పట్టేందుకు ముదిరాజులకు కూడా సమాన హక్కు కల్పిస్తామని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలను వెనుక కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నామాల యాద గిరి, గంగాధర్‌, విజయ్‌, నామాల శ్రీనివాస్‌, లచ్చయ్య, శంకర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T05:21:17+05:30 IST