ఇండియాలో తొలి ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌

ABN , First Publish Date - 2020-09-05T05:09:41+05:30 IST

భారతదేశంలో ఇంతవరకు తన ఉత్పత్తులకు థర్డ్‌ పార్టీ సెల్లర్‌గా ఉంటున్న

ఇండియాలో తొలి ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌

భారతదేశంలో ఇంతవరకు తన ఉత్పత్తులకు థర్డ్‌ పార్టీ సెల్లర్‌గా ఉంటున్న ఆపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ఆరంభించబోతోంది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ను ఇందుకు అనుకూలంగా మలుచుకోనుంది. మొట్టమొదటి అధికారిక ఆపిల్‌ స్టోర్‌ను ముంబైలోని బికెసి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయనుంది. మేకర్‌ మేక్సిటీ మాల్‌లో సుమారు పాతిక వేల చదరపు అడుగుల మేర స్పేస్‌ను తీసుకుంటోంది.


రెండు ఫ్లోర్‌లుగా ఈ స్టోర్‌ ఉంటుంది. అందులో   మొదటిది ఎక్స్‌పీరియన్స్‌ కోసం, రెండోది అమ్మకాలు, సర్వీస్‌ల కోసం ఉపయోగించనుంది. బెంగళూరులో రెండో స్టోర్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాల్లో ఉన్నట్టు సమాచారం. చైనా నుంచి దిగుమతులకు వ్యతిరేక వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత దేశంలో ఐఫోన్‌ ఉత్పత్తిని కూడా చేపట్టాలని అనుకుంటోంది.


Updated Date - 2020-09-05T05:09:41+05:30 IST