అగ్నిపథ్‌ను పూర్తిగా రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-27T05:49:32+05:30 IST

కాంట్రాక్టు పద్ధతి లో సైనికులను నియమించే ప్రతి పాదనతో కూడిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

అగ్నిపథ్‌ను పూర్తిగా రద్దు చేయాలి
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న పీఎల్‌ నరసింహులు

పీలేరు, జూన్‌ 26: కాంట్రాక్టు పద్ధతి లో సైనికులను నియమించే ప్రతి పాదనతో కూడిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పీఎల్‌ నరసింహులు కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. పీలేరులోని కార్యాలయంలో ఆదివారం నియోజక వర్గ సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘అగ్నిపథ్‌’ ద్వారా సైన్యంలో నాలుగు సంవత్సరాలు ఉపయో గించుకుని 20 శాతం మందిని పర్మినెంట్‌ చేసి 80 శాతం మందిని నిరుద్యోగు లుగా మారుస్తామనడం హేయమైన చర్య అన్నారు. విభజన హామీలు, సంజీవని వంటి ప్రత్యేక అంశంలో ద్రోహం చేసినా పట్టించుకోకుండా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. జిల్లా కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారిగా పీలేరుకు విచ్చేసిన అతన్ని కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సీపీఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టీఎల్‌ వెంకటేశ్‌, ఏఐటీయూసీ కార్యదర్శి నరసింహులు, నాయకులు శ్రీనివాసులు, సురేంద్ర, వెంకటరమణ, నాగరాజ, ప్రవీణ్‌, చందు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T05:49:32+05:30 IST