Abn logo
Jun 5 2020 @ 04:13AM

జీవో-3 రద్దుపై పోరాటం ఉధృతం చేస్తాం

గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ 


పాడేరు: జీవో నంబర్‌-3 రద్దుకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోడా సింహాద్రి, సోమెలి సింహాచలం అన్నారు. గురువారం ఉద్యోగుల భవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో తాము జీవో-3పై ఉద్యమిస్తామన్నారు. అలాగే సీపీఎంకు అనుబంధంగా ఉండే గిరిజన సంఘంతో తాము కలవబోమన్నారు. స్వతంత్రంగానే ఉద్యోగుల సంఘాలతో తమ ఉద్యమాన్ని చేపడతామన్నారు. అలాగే సుప్రీంకోర్టు జీవో-3ని రద్దు చేసి ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement