పోరాటం ఆగదు

ABN , First Publish Date - 2022-01-26T06:12:12+05:30 IST

ఉద్యోగులను వంచన చేసేలా రూపొందించిన కొత్త పీఆర్‌సీకి పాతరేసి పాత పీఆర్‌సీ యధాతదంగా అమలు చేయాలని పీఆర్‌సీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకిచ్చిన రివర్స్‌ పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు జేఏసీల నేతలు స్థానిక ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదురుగా గల ఇరిగేషన్‌ కాంపౌండ్‌ నుంచి జిల్లానలుమూలల నుంచీ వచ్చిన వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పురవీధుల్లో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ చేరుకుని ధర్నా నిర్వహించారు.

పోరాటం ఆగదు
కడపలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

పాత పీఆర్‌సీ అమలు చేయాలి

ఐఆర్‌ కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబులు కొనసాగించాలి

సీపీఎస్‌ రద్దు చేసి పెండింగ్‌ డీఏలన్నీ ఇవ్వాలి

లేదంటే చర్చలకు వచ్చే ప్రసక్తే లేదు

కడపలో కదం తొక్కిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు

భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ముళ్ల కంచెలతో ముందస్తుగా పోలీసులు


కడప (మారుతీనగర్‌) జనవరి 25: ఉద్యోగులను వంచన చేసేలా రూపొందించిన కొత్త పీఆర్‌సీకి పాతరేసి పాత పీఆర్‌సీ యధాతదంగా అమలు చేయాలని పీఆర్‌సీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకిచ్చిన రివర్స్‌ పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో నాలుగు జేఏసీల నేతలు స్థానిక ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదురుగా గల ఇరిగేషన్‌ కాంపౌండ్‌ నుంచి జిల్లానలుమూలల నుంచీ వచ్చిన వేలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పురవీధుల్లో భారీ ర్యాలీగా కలెక్టరేట్‌ చేరుకుని ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా పీఆర్‌సీ సాధన సమితి జేఏసీ చైర్మన్‌ బి.శ్రీనివాసులు, నాయకులు జనార్ధన్‌రెడ్డి, ఎస్‌.జలీల్‌ఖాన్‌, జీవన్‌, లక్ష్మీరాజా, గోవిందు రవికుమార్‌, కొండయ్య, సి.వి.ప్రసాద్‌, కె.సురే్‌షబాబు, మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన హక్కులను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టు విడనాడి ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేసి చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కాదని ముందుకెళ్తే మునుముందు జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఐఆర్‌ కన్నా అధికంగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, పాత హెచఆర్‌ఏ స్లాబులు కొనసాగించాలని. సీపీఎస్‌ రద్దు చేసి, పెండింగ్‌ డీఏలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉన్న సీసీఏ యథావిధిగా కొనసాగించాలన్నారు. పెన్షన్‌ అడిషనల్‌ క్వాంటమ్‌ 70 ఏళ్లు కొనసాగించాలన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌, సచివాలయ ఉద్యోగులకు మాస్టర్‌ స్కేల్‌ ఇస్తూ వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. అధికార పాలకవర్గం, ముఖ్యమంత్రి కూడ బలుక్కుని ఉద్యోగులను, ఉపాధ్యాయులను రివర్స్‌ పేరుతో వేధించడం తగదన్నారు. పీఆర్‌సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఆర్‌సీ కమీషన రిపోర్టు లేకుండా పీఆర్‌సీని ప్రభుత్వం అమలు చేయాలనుకోవడం నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులతో మొక్కుబడిగా చర్చలు జరిపినట్లు నటించి అర్ధరాత్రి చీకటి జీవోలు ఇవ్వడమనేది దుర్మార్గమైన చర్య గా అభివర్ణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన జీ.వోలను రద్దు చేసి పీఆర్‌సీపై తిరిగి చర్చలు జరిపి నూతన పీఆర్‌సీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నేతలు ప్రసాద్‌యాదవ్‌, శ్రీనివాసరాజు, ఆర్టీసీ నేతలు జి.వి.నరసయ్య, ఎ.ఆర్‌.మూర్తి, సగినాల శ్రీనివాసులు, నాగముని, రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, వెంకటరెడ్డి, గంగన్న, నరేంద్ర, నిత్యా, విజయ్‌, రాఘవ, మహిళా నాయకురాలు జ్యోతి, భారతి, మాధవి, వేలాది మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 


నేడు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేత...

ప్రభుత్వ తీరును నిరసిస్తూ 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, తదితర ఉద్యోగులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. 










Updated Date - 2022-01-26T06:12:12+05:30 IST