Abn logo
Aug 2 2021 @ 23:14PM

ఘనంగా బోనాల పండుగ

పటాన్‌చెరులో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు/కోహీర్‌/నారాయణఖేడ్‌/నాగల్‌గిద్ద/నర్సాపూర్‌/మునిపల్లి, ఆగస్టు 2: పటాన్‌చెరులో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆలయాల వద్ద పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయాలను శాసనమండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌, నాయకులు ఆదర్శరెడ్డి, విజయ్‌కుమార్‌, అఫ్జల్‌ తదితరులు సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబావిలో ఆదివారం రాత్రి తొట్టెల ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఊరేగింపులో పటాన్‌చెరు నియోజకవర్గం కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్జి కాటశ్రీనివా్‌సగౌడ్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, కౌన్సిలర్‌ సుధారాణి పాల్గొన్నారు. కోహీర్‌ మండలంలోని నాగిరెడ్డిపల్లిలో సోమవారం పోచమ్మ, ఊరడమ్మకు గ్రామస్థులు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఖేడ్‌ మండలం బాణాపూర్‌లో  సర్పంచు శేరికార్‌ కవిత, గ్రామస్థులు ఊరడమ్మకు బోనాలను సమర్పించారు. నాగల్‌గిద్ద మండలంలోని కారముంగిలో సర్పంచు అనితగుండెరావుపాటిల్‌ ఆధ్వర్యంలో దుర్గమ్మ బోనాల పండుగను నిర్వహించారు.  నర్సాపూర్‌లో మొదటి రోజు ముత్యాలమ్మ ఆలయం వద్ద బోనాల ఉత్సవాలు నిర్వహించగా సోమవారం నల్లపోచమ్మ, దుర్గమ్మ, భూలక్ష్మి ఆలయాల వద్ద బోనాలను సమర్పించి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. యాదవసంఘం, ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన పలహార బండ్ల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. శివ్వంపేట మండలం గోమారంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో సోమవారం మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి కుటుంబీకులు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పలహార బండిని ప్రదర్శించారు.